Srikakulam Bear: వామ్మో.. మరో ఎలుగుబంటి వచ్చింది.. భయాందోళనలో సిక్కోలు ప్రజలు..
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబండి ఘటన మరవక ముందే, మరో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Bear hulchul in Srikakulam: ఉత్తరాంధ్రలో ఎలుగుబంట్ల సంచారం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా మన్యం జిల్లాను ఎలుగుబంట్లు వణికిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబండి ఘటన మరవక ముందే, మరో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. గురువారం కురుపాం మండలం సూర్యనగర్‌లో ఎలుగుబంటి కలకలం రేపింది. దీంతో అక్కడి ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు, ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. పొలాల దగ్గరకు వెళ్లినప్పుడు ఎలుగుబంటిని చూశామని, ఇప్పుడు పొలం పనులకు వెళ్లాలంటేనే భయంగా ఉందన సూర్యనగర్ వాసులు చెబుతున్నారు.
అటవీ శాఖ అధికారులు స్పందించి, ఎలుగుబంటిని పట్టుకోవాలని కోరుతున్నారు, గిరిజనులు. ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రస్తుతం సూర్యనగర్ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని చెబుతున్నారు అటవీశాఖ అధికారులు.
కాగా.. ఇటీవల ఎలుగుబంటి దాడిలో వజ్రపుకొత్తూరు మండలంలోని కిడిసింగి గ్రామానికి చెందిన కోదండరాం అనే రైతు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. దీంతోపాటు మరో ఏడుగురు ఎలుగు దాడిలో గాయపడ్డారు. ఈ క్రమంలో ఎలుగుబంటిని పట్టుకున్న అటవీ అధికారులు.. దానిని జూకి తరలిస్తుండగా మృతి చెందింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..