AB Venkateswararao: నిబంధనలు నాకే వర్తిస్తాయా..? ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం చేస్తా.. ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు..

ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం స్పందించారు. జీవో తన చేతికి ఇంకా ఇవ్వలేదంటూ వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేసినట్లు సోషల్ మీడియాలో మాత్రమే చూశానంటూ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

AB Venkateswararao: నిబంధనలు నాకే వర్తిస్తాయా..? ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం చేస్తా.. ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు..
IPS AB Venkateswara Rao
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 29, 2022 | 11:47 AM

IPS AB Venkateswara Rao on AP Govt: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీలోని జగన్ సర్కార్ మరోసారి సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై సస్పెండ్‌ చేస్తూ సోమవారం రాత్రి సీఎస్‌ సమీర్‌ శర్మ సస్పెండ్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం స్పందించారు. జీవో తన చేతికి ఇంకా ఇవ్వలేదంటూ వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేసినట్లు సోషల్ మీడియాలో మాత్రమే చూశానంటూ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవమని.. ఏడాదిన్నర క్రితం కేసు పెట్టినా ఇంతవరకూ చార్జిషీట్ వేయలేదని పేర్కొన్నారు. అసలు ట్రయల్ లేకుండా సాక్షులను ఎలా ప్రభావితం చేస్తానన్నారు.

ఈ సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో, పనికిమాలిన సలహాదారు ఇచ్చారో..? అంటూ మండిపడ్డారు వెంకటేశ్వరరావు. ఒకసారి హైకోర్టు కొట్టేసినప్పుదు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారన్నారు. 12 సీబీఐ, 6 ఈడీ కేసుల్లో జగన్‌కు చార్జిషీట్లు ఉన్నాయని గుర్తుచేశారు. శ్రీలక్ష్మి పైనా చార్జిషీట్లు ఉన్నాయి.. వారికి వర్తించని నిబంధనలు తనకు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ప్రతి వాక్యం తప్పు.. అని తాను నిరూపిస్తానన్నారు. ఒక్క రూపాయి అవినీతి జరగని చోట అవినీతి కేసు ఎలా పెడతారన్నారు. ఇజ్రాయెల్ వాళ్లకు రెండు లెటర్లు రాశారు.. అవినీతి నిరోధక చట్టాలకు లోబడి పనిచేస్తామని చెప్పారని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

ఇలాంటి వ్యక్తుల వల్ల వ్యవస్థలకు చెడ్డ పేరు వస్తుందని.. కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు తనను టార్గెట్ చేశాయంటూ వెంకటేశ్వరరావు తెలిపారు. కోడికత్తి కేసు అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చుస్తే గంటల్లోనే అడ్డుకున్నానని తెలిపారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఎన్నో అసాంఘిక కలాపాలను అడ్డుకున్నందుకే తనను టార్గెట్ చేశారని వివరించారు. ప్రభుత్వాన్ని పడగొడతా అని రాజభవన్ గేటు ముందు తాను కామెంట్ చేశానా..? ఎప్పుడంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తానని వెంకటేశ్వరరావు స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి

కాగా.. అంతకుముందు కూడా ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు వేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం ఆయనపై సస్పెన్షన్ ఎత్తేసిన జగన్ సర్కార్.. సర్వీస్‌ను మాత్రం చాలా కాలం పాటు పెండింగ్ లో పెట్టింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఇటీవలే ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!