Maharashtra Political Crisis: క్లైమాక్స్‌కు చేరిన ‘మహా’ రాజకీయం.. రేపే బలపరీక్ష.. ఉద్ధవ్ సర్కార్‌కు గవర్నర్ డెడ్‌లైన్..
ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకునేందుకు రేపు బలపరీక్ష నిర్వహించాలని బుధవారం ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ సూచించారు.
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాలు గంటగంటకు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ సమయంలో బలపరీక్షకు సిద్ధమవ్వాలని ఉద్ధవ్ ప్రభుత్వానికి గవర్నర్ బుధవారం సూచించారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ.. రేపు (గురువారం) శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉద్ధవ్ థాక్రేను ఆదేశించారు. ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకునేందుకు రేపు బలపరీక్ష నిర్వహించాలని మేరకు గవర్నర్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ముగించాలని గవర్నర్ కోష్యారీ లేఖలో పేర్కొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ఫ్లోర్ టెస్ట్ జరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య, రేపు బలపరీక్ష నిర్వహించాలని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని గవర్నర్ కోరడంతో ఏక్నాథ్ షిండే వర్గం ఈ రోజు రాత్రి ముంబైకి బయలుదేరనుంది. గౌహతిలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు రేపు ముంబై చేరుకునే అవకాశం ఉంది.
Maharashtra Governor Bhagat Singh Koshyari has written to state Assembly secretary to convene a special session of the State Assembly on June 30, with the only agenda of a trust vote against CM Uddhav Thackeray pic.twitter.com/9M5htIIE9R
ఇవి కూడా చదవండి— ANI (@ANI) June 29, 2022
ఆలయంలో షిండే పూజలు..
కాగా.. అస్సాంలోని గౌహతిలో ఉన్న శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ఈరోజు కామాఖ్యాదేవి ఆలయానికి చేరుకొని పూజలు చేశారు. నలుగురు ఎమ్మెల్యేలతో వచ్చిన షిండేను కామాఖ్యాదేవి ఆలయ కమిటీ కమిటీ ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శాంతి, సంతోషం కోసం ప్రార్థించడానికి వచ్చానంటూ పేర్కొన్నారు. ఫ్లోర్ టెస్ట్ కోసం రేపు ముంబైకి వెళ్లి అన్ని ప్రక్రియలను అనుసరిస్తామని రెబెల్ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు.
Assam | Rebel Shiv Sena leader Eknath Shinde along with four other Maharashtra MLAs reach Kamakhya Temple in Guwahati pic.twitter.com/UVtFkdJQcx
— ANI (@ANI) June 29, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..