Hyderabad: ఉదయ్‌పూర్‌లో టైలర్ హత్య.. హైదరాబాద్‌లో అలర్ట్.. ఆ ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు..

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చార్మినార్‌, పాతబస్తీ తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేశారు.

Hyderabad: ఉదయ్‌పూర్‌లో టైలర్ హత్య.. హైదరాబాద్‌లో అలర్ట్.. ఆ ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు..
Hyderabad Police
Follow us

|

Updated on: Jun 29, 2022 | 9:26 AM

Hyderabad police alert in Old City: బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మ ఫొటోను స్టేటస్‌గా పెట్టుకున్నాడని రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను చంపడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో జరిగిన ఘటనపై హైదరాబాద్‌ పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చార్మినార్‌, పాతబస్తీ తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేశారు. కాగా.. నూపుర్‌శర్మ ఫోటోను స్టేటస్‌గా పెట్టుకున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇద్దరు దుండగులు టైలర్‌ దుకాణంలోకి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కొలతలు తీసుకుంటున్న టైలర్‌ను గొంతు కోసి దారుణంగా చంపేశారు. ఈ హత్య తరువాత ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హంతకులకు కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తూ ర్యాలీ తీశారు. టైలర్ హత్య తర్వాత పోలీసులు ఇద్దరు దుండగులను అరెస్ట్‌ చేశారు. ఇద్దరు హంతకులు ఈ మర్డర్‌ తరువాత వీడియో కూడా రిలీజ్‌ చేశారు. దుస్తులు కుట్టించుకుంటాననే నేపంతో హంతకులు అతని దుకాణానికి వచ్చి హత్య చేశారు. అంతేకాదు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

ఈ ఘటన తర్వాత రాజస్థాన్ లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు.. ఉదయ్‌పూర్‌లో షాపులన్నింటినీ మూసి వేశారు. ఈ దుర్ఘటనతో ఉదయ్ పూర్ ఒక్కసారిగా భగ్గుమంది.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానిక బీజేపీ డిమాండ్ చేసింది.. పరిస్థితి తీవ్రత గుర్తించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ రంగంలోకి దిగారు.. నిందితులకు శిక్షపడుతుందని ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. దయచేసి ఎవరూ ఉద్రిక్తపూరితమైన వ్యవహారాలను వ్యాప్తి చేయవద్దని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు