Plastic Items ban: జులై 1 నుంచి ఈ వస్తువుల వాడకంపై నిషేధం.. లిస్టులో ఏమున్నాయంటే?

Single Use Plastic Ban: పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ సంస్థ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) వచ్చే నెల నుంచి ఉపయోగించలేని వస్తువుల జాబితాను విడుదల చేసింది.

Plastic Items ban: జులై 1 నుంచి ఈ వస్తువుల వాడకంపై నిషేధం.. లిస్టులో ఏమున్నాయంటే?
Plastic Items Ban
Follow us
Venkata Chari

|

Updated on: Jun 28, 2022 | 4:44 PM

పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించబోతోంది. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ గత ఏడాది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, నిషేధాన్ని ప్రకటించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) వచ్చే నెల నుంచి ప్రజలు కొన్ని వస్తువులను ఉపయోగించకూదని పేర్కొంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొత్త సర్క్యులర్ ప్రకారం, జులై 1, 2022 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిషేధించనున్నారు. దీని కింద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏమిటి?

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఉత్పత్తులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల కింద – వస్తువుల ప్యాకేజింగ్ నుంచి సీసాలు (షాంపూ, డిటర్జెంట్, సౌందర్య సాధనాలు), పాలిథిన్ బ్యాగ్‌లు, ఫేస్ మాస్క్‌లు, కాఫీ కప్పులు, క్లాంగ్ ఫిల్మ్, చెత్త బ్యాగ్‌లు, ఫుడ్ ప్యాకేజింగ్ వంటి వాటి ఉత్పత్తులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

జులై 1 నుంచి వీటిపై నిషేధం..

ప్లాస్టిక్ స్టిక్స్‌తో కూడిన ఇయర్ బడ్స్, బెలూన్లకు అంటించే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, మిఠాయి స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, డెకరేటివ్ థర్మాకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, ప్లాస్టిక్ ప్యాకింగ్ వస్తువులు, ప్లాస్టిక్ ఆహ్వాన పత్రికలు, సిగరెట్ ప్యాక్‌లు, 100 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్, పీవీసీ లాంటి ఉత్పత్తులు ఈ నిషేధం లిస్టులో ఉన్నాయి.

SUP వస్తువులను విక్రయించకూడదనే షరతుతో తాజా వాణిజ్య లైసెన్స్‌లను జారీ చేయాలని CPCB స్థానిక అధికారులను ఆదేశించింది. మరీ ముఖ్యంగా నిషేధిత వస్తువులను విక్రయిస్తున్నట్లు తేలితే ప్రస్తుతం ఉన్న వాణిజ్య లైసెన్స్‌లను రద్దు చేస్తారు.

ఓ నివేదిక ప్రకారం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే టాప్ 100 దేశాలలో భారతదేశం 94 ర్యాంక్‌లో ఉంది (మొదటి మూడు స్థానాలు- సింగపూర్, ఆస్ట్రేలియా, ఒమన్).

ప్రస్తుతం ఎలాంటివి ఎంచుకోవాలి..

ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని CPCB వినియోగదారులను కోరింది. ఉదాహరణకు, ప్లాస్టిక్ బ్యాగ్‌లకు బదులుగా కాటన్ బ్యాగులను ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. సర్క్యులర్‌లో, “ప్లాస్టిక్ బ్యాగ్‌ల స్థానంలో సహజ వస్త్రాన్ని ఉపయోగించవచ్చు. సేంద్రీయ పత్తి, ఉన్ని లేదా వెదురుతో తయారు ఉత్పత్తులను వాడొచ్చని పేర్కొంది.