Rain Alert: తెలంగాణ ప్రజలకు ఐఎండీ అలర్ట్.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు..
Rain Alert For Telangana: రుతుపవనాల ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Rain Alert For Telangana: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఇప్పటికే ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితలద్రోణి ఉంది. దీంతోపాటు రుతుపవనాల ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.
కాగా.. సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 10 సెంటీమీటర్లు, జూలూరుపాడులో 8.5, నిజమాబాద్ జిల్లాలోని మంచిప్పలో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు అత్యధికంగా సంగారెడ్డిలో 6.4 సెం.మీ వర్షపాతం నమోదైంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేరెడ్‌మెట్‌లో 5.4, అల్వాల్ కొత్తబస్తీ 5.3, కంది 5, మహేశ్‌నగర్‌లో 4.4 సెం.మీ.వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. కాగా.. హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసింది. ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..