Maharashtra Political Crisis: గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు శివసేన.. క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న మహా రాజకీయాలు..

మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. రేపటి బలపరీక్షను వాయిదా వేయలాని సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ వేయనుంది.

Maharashtra Political Crisis: గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు శివసేన.. క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న మహా రాజకీయాలు..
Maharashtra Political Crisis
Follow us

|

Updated on: Jun 29, 2022 | 11:12 AM

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవ్వాలని ఉద్ధవ్ ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశించిన మరుక్షణమే శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని రేపు (గురువారం) ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ లేఖ రాశారు. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ముగించాలని గవర్నర్ కోష్యారీ సూచించారు. దీంతో మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. రేపటి బలపరీక్షను వాయిదా వేయలాని సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ వేయనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇంత అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని శివసేన అభిప్రాయపడింది.

అనర్హత వేటు ప్రక్రియలో భాగంగా శివసేనకు చెందిన 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టవద్దని జూలై 11 వరకు సుప్రీం ఇటీవల ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో శాసనసభలో ఎలాంటి బలపరీక్ష ఉండకూడదనే పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు జూన్ 27న సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం అనవసరమైన రాజకీయ విషయాలపై కోర్టు ఆదేశించలేమని పేర్కొంది. ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలపాలు జరిగితే, ఎప్పుడైనా తిరిగి ఉన్నత న్యాయస్థానానికి రావచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదించిన సీనియర్ అడ్ దేవదత్ కామత్‌కు తెలిపింది. ఈ మేరకు శివసేన గవర్నర్ నిర్ణయంపై పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది.

మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. గవర్నర్ నిర్ణయం దురదృష్టకరమని, దీని వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని తెలిపారు. తమ 16 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఇది చట్టవిరుద్ధమైన చర్య అని.. సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

శరద్ పవార్‌కు ఉద్ధవ్ థాక్రే ఫోన్..

కాగా.. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో NCP అధినేత శరద్ పవార్‌ మహారాష్ట్ర మంత్రులతో భేటీ అయ్యారు. దీంతోపాటు శరద్ పవార్‌తో సీఎం ఉద్ధవ్ థాక్రే ఫోన్లో సంభాషించారు. రేపటి ఫ్లోర్ టెస్ట్ వ్యవహారంపై సీఎం శరద్ పవర్ సలహా తీసుకుంటున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల కోసం వేచి చూడాలని శరద్ పవార్, థాక్రేకు సూచించారు. ఫ్లోర్ టెస్ట్ కచ్చితంగా నిర్వహించాల్సిందే అని కోర్టు తీర్పు చెబితే అప్పుడు ఇంకో వ్యూహం అమలు చేయాలని సూచించారు.

మాతోశ్రీలో చర్చలు..

గవర్నర్ నిర్ణయంపై న్యాయ నిపుణులతో సైతం సీఎం ఉద్ధవ్ థాకరే చర్చిస్తున్నారు. సీఎం ఉద్ధవ్ థాకరేతో ఎంపీ సంజయ్ రౌత్ కూడా భేటీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మాతోశ్రీలో సంజయ్ రౌత్.. థాక్రేతో చర్చిస్తున్నారు. కాగా చర్చల అనంతరం మహా వికాస్ అఘాడీ నేతలంతా శరద్ పవార్‌తో భేటీ కానున్నారు.

గువాహటి టూ ముంబై వయా గోవా

అస్సాంలోని గౌహతిలో ఉన్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు ముంబై తిరుగు ప్రయాణంపై ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారు అస్సాం నుంచి గోవా పయనమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు గోవాలోని తాజ్ రిసార్ట్‌లో 70 గదులు బుక్ చేశారు. ఈ సాయంత్రానికి ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు గోవా చేరుకోనున్నారు. రేపు ఉదయం నేరుగా గోవా నుంచి నేరుగా ముంబై చేరుకోనున్నారు. బలపరీక్ష సమయానికి ముంబై చేరుకునేలా ప్రణాళిక చేసుకుంటున్నారు.

ఫడ్నవీస్ ఇంటికి బీజేపీ నేతలు..

గవర్నర్ కోష్యారీ బలపరీక్షకు ఆదేశించిన నేపథ్యంలో ముంబైలో రాజకీయాలు వేడెక్కుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటికి బీజేపీ నేతలు చేరుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం ముంబైలోని తాజ్ ప్రెసిడెంట్ హోటల్‌లో సమావేశమవ్వాలని బీజేపీ తన ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..