AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covovax: గుడ్‌న్యూస్‌.. ఆ వయసు వారికి కోవిడ్‌ వ్యాక్సిన్‌.. ఆమోదం పొందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్

Covovax: దేశంలో ప్రస్తుతం కోవిడ్‌ తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరికి కోవిడ్‌ టీకాలను అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇండియాలోనే తొలి mRNA కొవిడ్ వ్యాక్సిన్ కు డ్రగ్స్..

Covovax: గుడ్‌న్యూస్‌.. ఆ వయసు వారికి కోవిడ్‌ వ్యాక్సిన్‌.. ఆమోదం పొందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్
Subhash Goud
|

Updated on: Jun 29, 2022 | 11:10 AM

Share

Covovax: దేశంలో ప్రస్తుతం కోవిడ్‌ తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరికి కోవిడ్‌ టీకాలను అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇండియాలోనే తొలి mRNA కొవిడ్ వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మంగళవారం ఆమోదం పొందింది. జెనోవా బయోఫార్మాసూటికల్స్ 18ఏళ్లు అంతకంటే పైబడ్డ వారికి అత్యవసర వినియోగం కోసం ఆమోదించినట్లుగానూ అధికారులు చెబుతున్నారు. ఇతర mRNA వ్యాక్సిన్లను సున్నా డిగ్రీల టెంపరేచర్ వద్ద ఉంచితే, కొవావ్యాక్స్ మాత్రం 2-8 డిగ్రీల మధ్య ఉంచాల్సి ఉంటుంది.

దేశంలో మార్చి 16 నుండి 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభమైంది. గత ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించబడింది. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయగా, ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేయడం గత ఏడాది ఫిబ్రవరి 2 నుండి ప్రారంభమైంది. ఈ పరిస్థితుల మధ్య సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారుచేసిన కొవిడ్ వ్యాక్సిన్ కొవావ్యాక్స్ ను 7 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్కులు వాడేందుకు వీలుగా రూపొందించారు.

COVID-19 సబ్జెక్ట్ నిపుణుల కమిటీ గత వారం 7 నుండి 11 సంవత్సరాల వయస్సు గలవారికి Covovax, 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న Gennova రెండు డోస్ m-RNA వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. ఆ సిఫార్సు చేసిన తర్వాత DCGI ఆమోదం తెలిపిందని అధికారిక వర్గాలు అన్నారు.

ఇవి కూడా చదవండి

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వం, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ మార్చి 16న ఈ విషయమై DCGIకి ఒక దరఖాస్తు సమర్పించారు. నిపుణుల ప్యానెల్, ఏప్రిల్‌లో జరిగిన చివరి సమావేశంలో దరఖాస్తుపై పూణేకి చెందిన సంస్థ నుండి మరింత డేటాను కోరింది.

DCGI డిసెంబరు 28న పెద్దవారిలో 12 నుండి 17 సంవత్సరాల వయస్సు గలవారిలో కొన్ని షరతులకు లోబడి మార్చి 9న అత్యవసర పరిస్థితుల్లో పరిమితం చేయబడిన ఉపయోగం కోసం Covovaxని ఆమోదించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి