ఆసుపత్రిలోని బెడ్ మీద నుంచి 3 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లిన కుక్క.. గాయాలతో శిశివు మృతి

రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఆసుపత్రిలోకి ప్రవేశించిన శునకం..తల్లి పక్కన ఉన్న శిశువును నోట కరుచుకొని తీసుకెళ్లిపోయింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఆసుపత్రిలోని బెడ్ మీద నుంచి 3 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లిన కుక్క.. గాయాలతో శిశివు మృతి
Newborn Baby Death
Surya Kala

|

Jun 29, 2022 | 10:27 AM

Panipat: హరియాణాలోని పానిపట్‌లో దారుణ ఘటన జరిగింది. ప్రసూతి ఆసుపత్రిలోకి ప్రవేశించిన శునకం బెడ్‌పై ఉన్న మూడు రోజుల శిశువును ఎత్తుకెళ్లింది. ఆ శిశువు తీవ్ర గాయాలతో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. పానిపట్‌లోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో షబ్నం మూడు రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఆసుపత్రిలోకి ప్రవేశించిన శునకం..తల్లి పక్కన ఉన్న శిశువును నోట కరుచుకొని తీసుకెళ్లిపోయింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

తెల్లవారుజామున 2గంటల సమయంలో తల్లి లేచి చూడగా బిడ్డ కనిపించలేదు. విషయాన్ని వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి చెప్పింది. సిబ్బంది, బంధువులు చుట్టుపక్కల ప్రాంతంలో వెతికారు. హాస్పిటల్‌ సమీపంలో ఉన్న ఓ ప్రాంతంలో ఓ కుక్క శిశువును నోట కరుచుకొని ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఆశిశువును ఆసుపత్రికి తీసుకొచ్చారు…అయితే అప్పటికే గాయాలతో మృతిచెందినట్లు వైద్యులు తేల్చారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu