Andhra Pradesh: జగన్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతి రద్దు
అమరావతి ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతిని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఫ్లాట్లను వెంటనే ఖాళీ చేసివ్వాలని ఆదేశించింది.
AP Government Employees: ఏపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హైదారాాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతిని ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతి రద్దు చేస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారంలోగా సదరు ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్లను ఖాళీ చేసివ్వాలని ఆదేశించింది. ఖాళీ చేసిన ఫ్లాట్‌లను మంచి స్థితిలో అప్పగించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యతని స్పష్టం చేసింది. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులతోపాటు అసెంబ్లీ ఎంప్లాయిస్, ఆయా శాఖాధిపతులు, హైకోర్టు అండ్ రాజ్‌భవన్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు ఉచిత వసతిని రద్దు చేసింది ప్రభుత్వం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేటాయించిన ఫ్లాట్లను ఖాళీ చేయాలని ఆదేశించింది.
జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా అవ్వడంతో ఉద్యోగుల ఆందోళన
ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ అకౌంట్ల నుంచి నగదు విత్‌డ్రా కావడంపై గందరగోళం నెలకుంది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు బధవారం ఆర్థిక శాఖ అధికారులను కలిసి.. సమస్యను వివరించారు. ఎలా జరిగిందో తమకు కూడా తెలియడం లేదని, విచారణ జరిపి స్పష్టత ఇస్తామని ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామని, క్రింది స్థాయి అధికారులు నుంచి రిపోర్ట్ తెప్పించుకుని సమస్యను పరిష్కరిస్తామని ఆర్థికశాఖ అధికారులు హామీ ఇచ్చారని జేఏసీ నేతలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..