AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డులో మీ ఫొటో బాలేదా..? జస్ట్ నిమిషాల్లోనే మార్చుకోవచ్చు.. సింపుల్ స్టెప్స్ ఇవే..

ఆధార్ కార్డులో మీ ఫొటో బాలేదా..? మార్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు నిమిషాల వ్యవధిలోనే ఫొటో మార్చుకోవచ్చు. ఈ మేరకు యూఐడీఏఐ ఫొటోను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా సులువుగా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలనే వివరాలు చూద్దాం.

Aadhaar Card: ఆధార్ కార్డులో మీ ఫొటో బాలేదా..? జస్ట్ నిమిషాల్లోనే మార్చుకోవచ్చు.. సింపుల్ స్టెప్స్ ఇవే..
Aadhaar
Venkatrao Lella
|

Updated on: Jun 09, 2026 | 10:46 AM

Share

దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌గా చెప్పవచ్చు. ఈ గుర్తింపు ధృవీకరణ పత్రం లేనిది ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందలేరు. ఎలాంటి ధృవీకరణకు అయినా సరే ఆధార్ కార్డు తప్పనిసరిగా అడుగుతున్నారు. దీంతో ఈ కార్డును ఎల్లప్పుడూ మన వెంటే ఉంచుకోవాల్సి వస్తోంది. దాదాపు ప్రతి చిన్న, పెద్ద పనికి ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. ఇలాంటి ముఖ్యమైన కార్డులో వివరాలన్నీ కరెక్ట్‌గా ఉంచుకోవడం వల్ల వెరిఫికేషన్ సమయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తవు. ముఖ్యం ఫొటో విషయంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆధార్ కార్డులోని ఫొటోలను గుర్తించడం కష్టతరంగా మారుతుంది.

సులువుగా మార్చుకునే అవకాశం

చాలా మంది ఆధార్ కార్డులోని ఫోటో చాలా పాతదిగా, అస్పష్టంగా, పాడైపోయి ఉండటం వల్ల వెరిఫికేషన్ సమయంలో జాప్యం జరుగుతోంది. మిమ్మల్ని గుర్తించడంలో ఆలస్యం జరగొచ్చు. ఇలాంటి సమయాల్లో మీరు ఆధార్ కార్డులోని ఫొటోను సులువుగా మార్చుకోవచ్చు. UIDAI ఆధార్ కార్డులో ఫోటోను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసుకోలేరు. సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి మార్చుకోవచ్చు. ఎలా అనేది చూద్దాం.

ఎలా మార్చుకోవాలంటే..?

-ముందుగా మీ ఇంటికి సమీపంలో ఉన్న ఏదైనా అధీకృత ఆధార్ సేవా కేంద్రానికి లేదా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది

– ఆధార్ కేంద్రానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న సిబ్బంది నుంచి ఆధార్ అప్‌డేట్ ఫారం తీసుకోండి

-ఈ ఫారంలో అడిగిన అవసరమైన, సరైన సమాచారాన్ని జాగ్రత్తగా నింపండి

-ఫారం సమర్పించిన తర్వాత మీ వేలిముద్రలు, కనుపాపను స్కాన్ చేయడం వంటి బయోమెట్రిక్ వివరాలను ధృవీకరిస్తారు

-అనంతరం అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ కొత్త ఫోటో తీస్తారు. ఈ కొత్త ఫోటో తర్వాత మీ ఆధార్ కార్డుపై ముద్రిస్తారు

-ఆధార్ కార్డులో ఫోటోను అప్‌డేట్ చేయడానికి రుసుం చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత మీకు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ అందిస్తారు

– మీ కొత్త ఫోటో సాధారణంగా కొన్ని రోజుల్లోనే UIDAI ప్రధాన రికార్డులలో అప్‌డేట్ చేయబడుతుంది

-అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఆధారంగా మీరు ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో మీ ఫొటో స్టేటస్ చెక్ చేపసుకోవచ్చు

-మీ ఫోటో అప్‌డేట్ చేయబడిందని తెలిసిన వెంటనే UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా డౌన్‌లోడ్ చేసుకున్న ఈ డిజిటల్ ఆధార్ కార్డులో అప్డేట్ అయిన మీ ఫొటో చూసుకోవచ్చు

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!