Viral Video: అదృష్టం అన్నిసార్లు కలిసి రాదు బ్రో… జస్ట్ మిస్, యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చావుగా..
Viral Video: ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా కొందరు మాత్రం ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఓ అంచనా ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 90 శాతం...
Viral Video: ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా కొందరు మాత్రం ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఓ అంచనా ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 90 శాతం, నిబంధనలను పాటించకపోవడం వల్ల జరిగినవేనని తేలింది. వేగంగా వెళ్లాలనే ఆతృత, అందరి ముందు గొప్ప అనే పేరు తెచ్చుకోవాలనే కోరిక వెరసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాను సైతం వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేశారు.
ఈ వీడియోలో ఇద్దరు కుర్రాళ్లు స్కూటిపై శరవేగంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఓ రైల్వే అండర్ బ్రిడ్జి వచ్చింది. ఇదే సమయంలో ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్ టేక్ చేయాలని భావించారు. అయితే అవతలి వైపు నుంచి భారీ ట్రక్ వస్తున్న విషయాన్ని గమనించారు. ఆల్‌మోస్ట్ ట్రక్‌ను ఢీకొట్టేంత పనిచేసిన ఆ కుర్రాడు వెంటనే లెఫ్ట్ సైడ్ కట్ కొట్టాడు. అయితే ఇది కేవలం అదృష్టం మాత్రమే, ఒక్క క్షణం ఆలస్యమైనా తీవ్ర నష్టం జరిగేది. దీనంతటినీ వెనకాల కారులో వస్తోన్న వారు వీడియో తీశారు. దీంతో వీడియోను ట్వీట్ చేసిన ట్రాఫిక్ పోలీసులు ‘ఎంత కాలమని అదృష్టంపై ఆధారపడతారు’ అని ఆలోచింపచేసే క్యాప్షన్‌ను జోడించారు.
అలాగే రోడ్డు భద్రతకు సంబంధించి కొన్ని నియమాలను షేర్ చేశారు. ‘ఇరుకైన రోడ్డులో లేదా క్యారేజ్‌వైపై వెడల్పు తక్కువ ఉన్న చోట బండిని ఓవర్ టేకింగ్ చేయకూడదు. ఎదురుగా వచ్చే వాహనాలకు అవరోధం కలిగించేలా ఉంటే ఓవర్ టేకింగ్ చేయకూడదు’ అని ట్రాఫిక్ నిబంధనలను ప్రస్తావించారు. చూశారుగా అదృష్టం అన్నిసార్లు మనవెంటే ఉంటుందా.? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటూ, నెమ్మదిగా వెళితేనే జీవితమనే ప్రయాణంలో ఎక్కువ కాలం జర్నీ చేయగలమని గుర్తుపెట్టుకోండి.
వైరల్ అవుతోన్న వీడియో..
How long do we depend on luck?#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/OQAwejkEBd
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 29, 2022
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..