Andhra Pradesh: అధికారంలోకి రాలేమని తెలిసే కుట్రలు చేస్తున్నారు.. చంద్రబాబుపై సజ్జల ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu Naidu) ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలోకి రాలేమని తెలిసి, చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ...

Andhra Pradesh: అధికారంలోకి రాలేమని తెలిసే కుట్రలు చేస్తున్నారు.. చంద్రబాబుపై సజ్జల ఫైర్
Sajjala Ramakrishnareddy
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 30, 2022 | 6:10 PM

టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu Naidu) ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలోకి రాలేమని తెలిసి, చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం (Sajjala Ramakrishna Reddy) పై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలోని ప్రతిపక్షాలు విమర్శలు చేయాలే గానీ.. అబద్ధాలు ప్రచారం చేయకూడదని విమర్శించారు. మూడేళ్ల అవకాశాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేసుకున్నారని ఆవేదన చెందారు. మద్యంలో విషం ఉందని దుష్ప్రచారం మొదలు పెట్టిన చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేదని చెప్పారు. పాలనా వ్యవస్థపై చంద్రబాబు ప్రజలకు భయాందోళనలు కలిగిస్తురాన్నారు. మూడు రాజధానుల నిర్ణయం ప్రజల సంకల్పంతో తీసుకున్నట్లు వెల్లడించారు. అమ్మఒడి (Ammavodi) పథకంలో లెక్కల్లో తేడా వచ్చిన 50వేల తల్లుల ఖాతాలు పెద్ద లెక్క కాదన్నారు. పాఠశాలల్లో హాజరుశాతం పెరిగేందుకు అటెండెన్స్ ను అర్హతగా పెట్టినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

కాగా.. రాష్ట్రంలో కొత్తగా 3 లక్షల 98 మందికి సామాజిక పెన్షన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. గత ఏడాది డిసెంబర్‌లోనూ ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం. తర్వాత డిసెంబర్‌ 1 నుంచి ఈ సంవత్సరం జూన్‌ 15వ తేదీ మధ్య పింఛన్ల కోసం దరఖాస్తులు అందగా, వాటిని జూన్‌ 15-23 తేదీల మధ్య రెండు విడతలుగా పరిశీలిన జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 3 లక్షల మంది పెన్షన్‌కు అర్హులని తేల్చింది జగన్‌ ప్రభుత్వం. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్‌ కార్డు, పాస్‌బుక్‌లను అందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..