APSRTC: ప్రయాణీకుల నడ్డి విరుస్తున్న ఆర్టీసీ.. మరోసారి ఛార్జీలు పెంచుతూ బిగ్ షాక్
ధరల పెరుగులతో అష్టకష్టాలు పడుతున్న సామాన్యులపై ఆర్టీసీ (APSRTC) మరో పిడుగు వేసింది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని అధికారులు నిర్ణయించారు. డీజిల్ సెస్ పెంపు వల్ల...
ధరల పెరుగులతో అష్టకష్టాలు పడుతున్న సామాన్యులపై ఆర్టీసీ (APSRTC) మరో పిడుగు వేసింది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని అధికారులు నిర్ణయించారు. డీజిల్ సెస్ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పడం లేదంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుతం రూ.10 ఉన్న కనీస ఛార్జీ తొలి 30కిలోమీటర్ల వరకు రూ.10గానే ఉండనుంది. (Andhra Pradesh) 35 నుంచి 60 కి.మీ వరకు రూ.5, 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10, 100 కి.మీ ఆపైన రూ.20 సెస్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.5లు సెస్ వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 31 నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 సెస్. 66 నుంచి 80కి.మీ వరకు రూ.10, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు. విజయవాడ (Vijayawada) నుంచి హైదరాబాద్ వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70 సెస్ పెంచారు. హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్ సెస్ పెంచుతూ అధికారులు ఛార్జీల్లో సవరణలు చేశారు.
కాగా..డీజిల్ సెస్ కారణంగా తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఫలితంగా హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్‌ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందని గుర్తు చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు టీఎస్‌ఆర్టీసీ అధికారులు గతంలో సర్క్యులర్‌లు పంపించారు. తద్వారా డీజిల్ సెస్ పెంచుతూ ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టికెట్ ధరలు పెంచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..