Tiger: కాకినాడ పులి, అనకాపల్లి పులి ఒకటే.. పాదముద్రల కొలతలతో నిర్ధారించిన అధికారులు

కాకినాడ (Kakinada) జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి కదలికలు ఆందోళన కలిగిస్తోంది. శ్రీరాంపురం వద్ద నిన్న గేదెను చంపి పాక్షికంగా తిన్న పులి.. మళ్లీ అక్కడికి వస్తుందని అధికారులు భావించారు. ఈ క్రమంలో పెద్దపులి...

Tiger: కాకినాడ పులి, అనకాపల్లి పులి ఒకటే.. పాదముద్రల కొలతలతో నిర్ధారించిన అధికారులు
Tiger Spotted
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 30, 2022 | 6:10 PM

కాకినాడ (Kakinada) జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి కదలికలు ఆందోళన కలిగిస్తోంది. శ్రీరాంపురం వద్ద నిన్న గేదెను చంపి పాక్షికంగా తిన్న పులి.. మళ్లీ అక్కడికి వస్తుందని అధికారులు భావించారు. ఈ క్రమంలో పెద్దపులి నక్కపల్లి మండలంలోకి వచ్చే అవకాశం ఉందంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి జాడ (Tiger) తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా.. తిరుపతిపాలెం సమీపంలో పులి అడుగు ముద్రలు ఉన్నాయంటూ మరికొందరు అధికారులకు సమాచారం అందించారు. వారు గ్రామానికి చేరుకుని స్థానికులను అడిగి సమాచారం తీసుకున్నారు. చీడిక, రేబాక, తిరుపతిపాలెం మీదుగా ఇటు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. పాదముద్రల కొలతలు తీసి కాకినాడ ప్రాంతంలో, ఇక్కడ ఉన్నది ఒకే పులి అని నిర్ధారించారు. అయితే.. గత నెల 28న నర్సీపట్నం మండలం వేములపూడి శివారు అప్పనపాలెంలో రెండు ఆవుదూడలపై పులి దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల తరువాత నాతవరం మండలం గాంధీ నగరం సమీపంలో ఓ ఆవుపై దాడి చేసింది. అక్కడ నుంచి జిల్లా సరిహద్దు దాటి కాకినాడ జిల్లాకు చేరింది. అక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసింది. దీని జాడ కనిపెట్టేందుకు అధికారులు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేయించారు. బోనువరకు వచ్చి వెనక్కి వెళ్లిపోవడంతో అధికారులు ఉసూరుమన్నారు. ఇప్పుడు అదే పులి కోటవురట్ల మండలంలో సంచారించడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటివరకు కాకినాడ జిల్లాలోనే తిరుగుతూ అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన పెద్దపులి, ఇప్పుడు మరో జిల్లాలోకి ఎంటరైంది. అనకాపల్లి జిల్లాలో బెంగాల్‌ టైగర్‌ పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. కాకినాడ జిల్లాను విడిచిపెట్టిన పెద్దపులి అనకాపల్లి జిల్లాలోకి ఎంటరైంది. ఎంటర్‌ కావడమే కాదు, తానొచ్చంటూ హెచ్చరికలు పంపింది. యలిమంచిలిపాలెం రేంజ్‌ ఫారెస్ట్‌లోకి ఎంటరైన టైగర్‌ కోట ఊరట్ల మండలం టి.జగ్గంపేట దగ్గర గేదెపై ఎటాక్ చేసి చంపేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..