Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: ఐదురుగు చనిపోతే ఉడుత కథలా.. సీఎండీ హరినాథరావు ప్రకటనపై లోకేష్ ఫైర్..

తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడుత వల్ల హై టెన్షన్ వైరు తెగడం వంటివన్నీ..

TDP: ఐదురుగు చనిపోతే ఉడుత కథలా.. సీఎండీ హరినాథరావు ప్రకటనపై లోకేష్ ఫైర్..
Nara Lokesh
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 30, 2022 | 2:56 PM

శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రిలో ఆటో ప్రమాద ఘటనకు ఉడుత కారణమంటూ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు ప్రకటించడంపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడుత వల్ల హై టెన్షన్ వైరు తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయని ఎద్దేవ చేశారు. కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పలేకపోయారా అని సెటైర్లు సంధించారు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే.. కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథలు చెప్పించడం  ఏపీ సర్కార్‌కి అలవాటైపోయిందని లోకేష్ విమర్శించారు.

బాధితులకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ తాడిమర్రిలో రైతులు, మృతుల కుటుంబాలతో కలిసి టీడీపీ నేతలు ఆందోళన చేశారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. తాడిమర్రి విద్యుత్ ఉపకేంద్రం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్వి లోకేష్.

ఏపీ వార్తల కోసం..