Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ప్రధాని పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే
జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ (Hyderabad) లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధాని రాక సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. హెచ్‌ఐసీసీ....
జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ (Hyderabad) లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధాని రాక సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. హెచ్‌ఐసీసీ పరిధిలో ఆంక్షలు విధించారు. నీరూస్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ వెళ్లేవారు.. సీఓడీ నుంచి దుర్గం చెరువు, బయోడైవర్సిటీ మీదుగా రాకపోకలు సాగించాలని వెల్లడించారు. ఆర్సీపురం, చందానగర్, మాదాపూర్, గచ్చిచౌలి నుంచి వచ్చే వాహనాలు బీహెచ్‌ఈఎల్, హెచ్‌సీయూ, ట్రిపుల్ ఐటీ మీదుగా వెళ్లాలి. మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి వచ్చేవారు ఏఐజీ ఆసుపత్రి, దుర్గం చెరువు మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు (Traffic Restrictions in Hyderabad) సూచించారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకూ తావు లేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. జులై 3న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ప్రముఖులు, నాయకులు, కార్యకర్తల వాహనాల పార్కింగ్ కోసం నగరం నలువైపులా పార్కింగ్ మైదానాలు సిద్ధం చేశారు.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు బైసన్‌పోలో మైదానం, బోయినపల్లి మార్కెట్ ప్రాంతాల్లో, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్‌రోడ్డు చుట్టుపక్కల స్థలాల్లో, ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే వాహనాలను రైల్వేమైదానం, రైల్వే డిగ్రీకళాశాల స్థలాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ వైపు ప్రముఖుల రాకపోకలు సాగించే సమయాల్లో పంజాగుట్ట, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, రాజ్‌భవన్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు ఈ మార్పులను గమనించాలని కోరారు.
In view of the Hon’ble PM Shri Narendra Modi’s visit to Hyderabad,the Traffic Police have made arrangements for diversion to ensure a smooth flow of traffic on the following routes.Offices located in these areas may stagger their work timings.#TrafficDiversions #CyberabadPolice pic.twitter.com/UTH0jXkXtt
— Cyberabad Police (@cyberabadpolice) July 1, 2022
ప్రధాని మోదీ(PM Modi) తెలంగాణ పర్యటన ఖరారైంది. శనివారం హైదరాబాద్‌కు చేరుకుంటారు ప్రధాని మోదీ. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. శనివారం, ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగే సమావేశాలకు ప్రధాని మోదీ హాజరవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న మోదీకి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నగరంలో 28 నుంచి 30 గంటల పాటు గడపనున్న ప్రధాని పర్యటనను.. విజయవంతంగా పూర్తి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.