AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara: దసరా షూటింగ్ మళ్లీ షూరు.. నాని సినిమా కోసం భారీ సెట్..

నాని మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న దసరా భారీ స్థాయిలో రూపొందుతోంది. తాజాగా విడుదల చేసిన స్టిల్‌లో నాని లుంగీ, బనియన్‌లలో మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు.

Dasara: దసరా షూటింగ్ మళ్లీ షూరు.. నాని సినిమా కోసం భారీ సెట్..
Nani
Rajitha Chanti
|

Updated on: Jul 02, 2022 | 7:03 AM

Share

న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం దసరా (Dasara). డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ ను శుక్రవారం పునఃప్రారంభించారు. ఈ భారీ షెడ్యూల్ లో మొత్తం ప్రధాన తారాగణం షూట్‌ లో పాల్గొంటున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ లో భారీ సెట్‌ వేశారు. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చేయని మాస్ రోల్‌ లో నటిస్తున్నారు. రా హెయిర్ స్టయిల్, గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌ లో కనిపించనున్నారు. నాని ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం విశేషం.

నాని మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న దసరా భారీ స్థాయిలో రూపొందుతోంది. తాజాగా విడుదల చేసిన స్టిల్‌లో నాని లుంగీ, బనియన్‌లలో మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. కోల్ మైన్ పై నిలబడి బీడీ తాగుతున్న లుక్ ఫుల్ మాసీగా వుంది. నాని ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలకో కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో జరుగుతుంది. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ ఈ చిత్రంలో నాని సరసన కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రం గత షెడ్యూల్‌లో షూటింగ్ స్టంట్ డైరెక్టర్ అన్బరీవ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. అంతకు ముందు నాని, కీర్తి సురేష్‌లపై ఓ భారీ పాట చిత్రీకరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాట కొరియోగ్రఫీ అందించి యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో 500 మంది డ్యాన్సర్లతో పాటని అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన ‘దసరా’ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. నాని మాస్ గెటప్, టెర్రిఫిక్ అవతార్ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!