Layoffs: 15 రోజుల్లో 24 వేలకిపైగా ఉద్యోగాలు ఉష్ కాకి.. ఆర్థిక మాంద్యం దెబ్బ గట్టిగానే పడేలా ఉందిగా..
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెట్టింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఆనాటి చేదు సంఘటనల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. అయితే కరోనా నుంచి కోలుకున్న..
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెట్టింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఆనాటి చేదు సంఘటనల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. అయితే కరోనా నుంచి కోలుకున్న ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం మరోసారి దెబ్బ తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండడం చూస్తుంటే ఆర్థిక మాంద్యం ప్రభావం అప్పుడే మొదలైనట్లు స్పష్టమవుతోంది. గతేడాది నుంచే మొదలైన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొత్తేడాదిలోనూ కొనసాగుతోంది. 2023లో మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 24 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు.
కొత్తేడాది మొదటి 15 రోజుల్లో, 91 టెక్ కంపెనీలు 24,000 మందికి పైగా టెక్ ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Layoffs.fyi.Crypto లెండింగ్ ఎక్స్ఛేంజ్ Crypto.com ప్రకారం అమెజాన్, సేల్స్‌ఫోర్స్, కాయిన్ బేస్‌తో మరికొన్ని కంపెనీలు ఏకంగా 24,151 మంది ఉద్యోగులను తొలగించాయి. భారత్‌లో ఓలా (200 మంది ఉద్యోగులను తొలగించిన), వాయిస్ ఆటోమేటెడ్ స్టార్టప్ స్కిట్.ఐ వంటి కంపెనీలు జనవరిలో వార్తల్లో నిలిచాయి. గతేడాది డిసెంబరులో 17,000 మంది టెక్ నిపుణులు ఉద్యోగాలను కోల్పోయారు.
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగుల తొలగింపునుల పరిశీలిస్తే.. మెటా, ట్విట్టర్, ఒరాకిల్, నివిడియా, స్నాప్, ఉబర్, స్పాటిఫై, ఇంటెల్‌తో పాటు మరికొన్ని కంపెనీలు 2022లో ఏకంగా 1,53,110 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఇదిలా ఉంటే 2023లో మరిన్ని తొలగింపులు ఉంటాయని తెలుస్తోంది. ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం గూగుల్ దాదాపు 6 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. 2023లో గూగుల్ సుమారు 11,000 ఉద్యోగులను కోల్పోవచ్చని అంచనా. 2023 టెక్ ప్రపంచంలో అత్యంత చెత్త ఏడాదిగా అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..