Honda Activa Smart: హోండా యాక్టివా ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్త వేరియంట్ వచ్చేస్తుందోచ్.. ఫీచర్స్ తెలిస్తే వావ్ అనాల్సిందే..
ప్రస్తుతం 6జీ వెర్షన్ లో అందుబాటులో ఈ బైక్ లు ఇంకా మార్కెట్ ను అమ్మకాల్లో శాసిస్తున్నాయి. 6జీ లో మూడు వెర్షన్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ స్కూటర్ లో హై ఎండ్ వర్షన్ విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
యాక్టివా..స్కూటర్ ప్రియులకు ఇష్టమైన బండి. సిటీ ట్రాఫిక్ కు అనువైన స్కూటర్.. కేవలం సిటీ మాత్రమే కాదు..ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు అలాగే గ్రామాల్లో కూడా ఎక్కువగా కొనే వాహనం. ముఖ్యంగా హోండా యాక్టివాను మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా కొంటాయి. ఎందుకంటే భార్యభర్తలు ఇద్దరూ ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటకు వెళ్లడానికి, అలాగే ఎవరైనా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉండడంతో అందరూ ఈ స్కూటర్ కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. హోండా కంపెనీ తన సేల్స్ లో ఎక్కువ స్కూటర్లను అమ్మింది యాక్టివాలనే అంటే దీని డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. వాహన ప్రియుల నుంచి వస్తున్న ఈ డిమాండ్ కు అనుగుణంగా హోండా కంపెనీ కూడా ఎప్పటికప్పుడు తన డిజైన్లను మారుస్తూ 3జీ, 4జీ, 5జీ అంటూ కొత్త ఫీచర్స్ తో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం 6జీ వెర్షన్ లో అందుబాటులో ఈ బైక్ లు ఇంకా మార్కెట్ ను అమ్మకాల్లో శాసిస్తున్నాయి. 6జీ లో మూడు వెర్షన్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ స్కూటర్ లో హై ఎండ్ వర్షన్ విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హోండా యాక్టివా స్మార్ట్
6జీ వరకూ అందుబాటులో ఉన్న యాక్టివా వెర్షన్లను క్లోజ్ చేస్తూ ప్రస్తుతం యాక్టివా స్మార్ట్ తో మార్కెట్ లోకి రావాలని హోండా కంపెనీ భావిస్తుంది. అయితే ఈ బైక్ యాక్టివా వెర్షన్లలోనే టాప్- ఎండ్ వేరియంట్. ప్రస్తుతం జనవరి 23న హోండా బ్లాక్ ఎండ్ ఈవెంట్ లోనే ఈ కొత్త స్కూటర్ గురించి ప్రకటించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త యాక్టివా స్మార్ట్ వేరియంట్‌లో స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే 109.51సీసీ ఇంజన్ ఉంది. అలాగే మోటార్ పవర్ అవుట్‌పుట్ అధిక 7.8 బీహెచ్‌పీ వద్ద నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 279 కిలోల బరువుతో రానున్న హోండా యాక్టివా స్మార్ట్ హోండా 6జీ కంటే ఓ కేజీ బరువు తక్కువేనని తెలుస్తోంది. ఈ బైక్ 1833 ఎంఎం పొడవు, 697 ఎంఎం వెడల్పు, 1156 ఎంఎం ఎత్తు, 1260 mm పొడవైన వీల్ బేస్ తో వచ్చే అవకాశం ఉంది.
ఆకర్షించనున్న యాంటీ థెఫ్ట్ అలారం
ఇప్పటి వరకూ హోండా ఏ వెర్షన్ యాక్టివాల్లో అందుబాటులో లేని యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్ హోండా హెచ్ – స్మార్ట్ ఉండే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది హోండా ఇగ్నిషన్ సిస్టమ్ లానే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్ సక్సెస్ అయితే హోండా 125, గ్రాజియా వంటి ఇతర హోండా స్కూటర్లకు ఈ ఫెసిలిటీ అందించే యోచనలో హోండా కంపెనీ ఉందని తెలుస్తోంది. అలాగే ఇలాంటి అడ్వాన్స్ డ్ ఫీచర్స్ వల్ల ప్రస్తుతం ఉన్న ధర కంటే రూ.3 వేల వరకూ అదనంగా పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి