Business: సెకెండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ 5 స్కూటర్లు రూ. 25 వేలలో.!

ఇప్పుడు ప్రతీ ఒక్కరూ వాహనాలు వాడుతున్నారు. డిస్టెన్స్ ఎంతైనా కూడా ప్రభుత్వ వాహనాల బదులు..

Business: సెకెండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ 5 స్కూటర్లు రూ. 25 వేలలో.!
Bike
Follow us

|

Updated on: Aug 22, 2022 | 12:53 PM

ఇప్పుడు ప్రతీ ఒక్కరూ వాహనాలు వాడుతున్నారు. డిస్టెన్స్ ఎంతైనా కూడా ప్రభుత్వ వాహనాల బదులు.. సొంత వెహికిల్స్ మీద వెళ్లేందుకే చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలోనే యాక్టివా, జ్యుపిటర్ లాంటి వాహనాలకు క్రేజ్ ఎక్కువైంది. వాటి సేల్స్ కూడా పెరిగాయి. అయితే వాటిని ఫస్ట్ హ్యాండ్‌లో కొనాలంటే.. తడిసి మోపెడవుతుంది. ఎందుకంటే యాక్టివా ధర సుమారు రూ. 60-75 వేల రేంజ్‌లో ఉంది. అందుకే ఇప్పుడు మనం రూ. 25 వేల లోపు పొందగలిగే స్కూటర్ల గురించి ఓసారి చూద్దాం.. ఈ జాబితాలో హోండా యాక్టివా నుంచి యమహా వరకు స్కూటర్లు ఉన్నాయి. ఈ స్కూటర్లన్నీ సెకండ్ హ్యాండ్ కేటగిరీకి చెందినవి.. వివిధ వెబ్‌సైట్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ల ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • హోండా యాక్టివా, ధర రూ. 25 వేలు: ఈ హోండా యాక్టివా వాహనం 110 సీసీ ఇంజిన్ కలిగి ఉంది. ఇది ప్రస్తుతం డ్రూమ్ వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇది 2013 సంవత్సరం మోడల్. ఇప్పటివరకు ఇది 17951 కి.మీ తిరిగింది.

  • మహీంద్రా డ్యూరో డీజెడ్, ధర రూ. 23 వేలు: మహీంద్రా నుంచి వచ్చిన ఈ స్కూటర్ OLXలో కొనుగోలుకు సిద్దంగా ఉంది. ఘజియాబాద్ RTOలో నమోదు చేయబడిన ఈ స్కూటర్ 2013 మోడల్. ఇప్పటి వరకు 24 వేల కిలోమీటర్లు నడిచింది.

  • యమహా ఫాసినో డార్క్‌నైట్ ఎడిషన్, ధర: రూ. 25 వేలు: ఈ యమహా స్కూటర్ ‘బైక్ దేఖో’ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇది 2015 మోడల్. ఇప్పటివరకు 13 వేల కిలోమీటర్లు నడిచింది.

  • పియాజియో వెస్పా 125CC: ఈ స్కూటర్ డ్రూమ్ వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులో ఉంది. ప్రస్తుతం 32 వేల కిలోమీటర్లు నడిచిన ఈ స్కూటర్ 125 సీసీ ఇంజిన్ కలిగి ఉంది.

  • టీవీఎస్ జూపిటర్ ఎస్టీడీ: ఈ స్కూటర్ ‘బైక్ దేఖో’ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ సెకండ్ హ్యాండ్ స్కూటర్‌కు రూ. 30 వేల ధర ఫిక్స్ చేశారు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు సంబంధిత వెబ్‌సైట్‌లలో పొందుపరిచిన విషయాల ఆధారంగా తీసుకోబడినవి. ఏదైనా సెకెండ్ హ్యాండ్ స్కూటర్ లేదా బైక్ కొనుగోలు చేసేటప్పుడు.. అన్ని వివరాలు చెక్ చేయడమే కాకుండా.. బైక్ కండీషన్ కూడా చూసుకోండి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం.. 

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే