AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rules: ఆఫీస్ అడ్రస్ వెరిఫికేషన్‌లో మార్పులు.. ప్రభుత్వ కొత్త నిబంధనలు

Office Addresses Verification: ఆఫీస్ అడ్రస్‌ల ఫిజికల్ వెరిఫికేషన్ నిబంధనలను ప్రభుత్వం మార్చింది. కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ భౌతిక ధృవీకరణ కోసం ప్రభుత్వం ..

New Rules: ఆఫీస్ అడ్రస్ వెరిఫికేషన్‌లో మార్పులు.. ప్రభుత్వ కొత్త నిబంధనలు
Office Addresses Verification
Subhash Goud
|

Updated on: Aug 22, 2022 | 2:24 PM

Share

Office Addresses Verification: ఆఫీస్ అడ్రస్‌ల ఫిజికల్ వెరిఫికేషన్ నిబంధనలను ప్రభుత్వం మార్చింది. కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ భౌతిక ధృవీకరణ కోసం ప్రభుత్వం కొత్త నిబంధనను జారీ చేసింది . ఈ కొత్త నియమం ప్రకారం.. కంపెనీ కార్యాలయ చిరునామా భౌతికంగా ధృవీకరించబడిన సమయంలో కార్యాలయంలో సాక్షులు ఉండటం అవసరం. సాక్షుల సమక్షంలో రెండు ప్రయోజనాలు ఉంటాయి. ముందుగా అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వారిపై సాక్ష్యాధారాలు ఉంటాయి. రెండవది ధృవీకరణలో మూడవ వ్యక్తిని సాక్షిగా ఉంచడం ద్వారా మొత్తం పనిలో పారదర్శకత తీసుకువచ్చేందుకు ఉపయోగపడనున్నట్లు అభిప్రాయపడుతోంది.

కంపెనీల చట్టం, 2013 ప్రకారం.. కంపెనీల రిజిస్ట్రార్ ఇచ్చిన చిరునామాలో వ్యాపారం సరిగ్గా జరగడం లేదని గుర్తించినట్లయితే కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయం భౌతిక ధృవీకరణను చేయవచ్చు. ఈ చట్టం కింద భౌతిక ధృవీకరణ నియమం కూడా చేర్చబడింది. రిజిస్టర్డ్ కంపెనీ ఇచ్చిన చిరునామాలో భౌతిక ధృవీకరణ సమయంలో ఇద్దరు సాక్షులను కలిగి ఉండటం అవసరం. ఈ సాక్షులు కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ నడుస్తున్న ప్రాంతంలోనే ఉండాలి. ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో రిజిస్ట్రార్, అవసరమైతే స్థానిక పోలీసుల సహాయం తీసుకోవచ్చని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది భౌతిక ధృవీకరణ ..

ఇవి కూడా చదవండి

అడ్రస్‌ ధృవీకరణ సమయంలో కంపెనీల రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన పత్రాలను ధృవీకరించవచ్చు. పత్రాల క్రాస్ వెరిఫికేషన్ ఒప్పు లేదా తప్పు తెలుసుకోవడానికి వీలుంటుంది. అడ్రస్ ప్రూఫ్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చినట్లుగానే ఉండాలి. ఆస్తి ఎవరి పేరు మీద ఉందో, అది అద్దెకు ఉంటే, దాని అద్దెకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. భౌతిక ధృవీకరణ సమయంలో రిజిస్ట్రార్ సంస్థ రిజిస్టర్డ్ కార్యాలయం ఫోటోను తీసుకుంటారు. భౌతిక ధృవీకరణ పూర్తయిన తర్వాత లొకేషన్, ఫోటోతో సహా మిగిలిన సమాచారంతో వివరాల నివేదిక తయారు చేయబడుతుంది.

అవినీతిని అరికట్టేందుకు..

ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం కంపెనీ పని తీరులో పారదర్శకతను తీసుకువస్తుంది. కంపెనీలు తమను తాము నమోదు చేసుకునే పేరు, పని, అదే ప్రయోజనం కోసం రిజిస్టర్డ్ కార్యాలయ చిరునామాలో పని చేయాలి. ఇందులో ఎలాంటి అవకతవకలు లేదా రిగ్గింగ్ జరగకుండా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనలను అమలు చేస్తుంది. ఈ ధృవీకరణకు సంబంధించి కొత్త నియమం అక్రమాలను నిరోధించడానికి ఒక కొత్త ప్రయత్నం. దీంతో అధికారుల ఇష్టారాజ్యానికి తెరపడి అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. ధృవీకరణ సమయంలో ఇద్దరు సాక్షులు హాజరవుతారు. వారు ఏవైనా అవాంతరాలపై సాక్ష్యం చెప్పగలరు. దీంతో ఆ అధికారి అక్రమాలు అనేవి బయటపడతాయనేది కేంద్రం ఆలోచన.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి