Income Tax Rule: బంగారు ఆభరణాల విషయంలో ఆదాయపు పన్ను నిబంధనలు ఏమిటి? ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు!

Income Tax Rule: బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి సంపాదన రాబట్టుకోవచ్చు. అందుకే ప్రజలు ఎక్కువగా బంగారాన్ని కొని పెట్టుకుంటారు. మీరు బంగారంలో..

Income Tax Rule: బంగారు ఆభరణాల విషయంలో ఆదాయపు పన్ను నిబంధనలు ఏమిటి? ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 21, 2022 | 3:14 PM

Income Tax Rule: బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి సంపాదన రాబట్టుకోవచ్చు. అందుకే ప్రజలు ఎక్కువగా బంగారాన్ని కొని పెట్టుకుంటారు. మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే బంగారు ఆభరణాలు ఉపయోగించుకోవడం ఎంతో మేలు. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కళ్లు మీపై పడకుండా ఉండాలంటే ఎన్ని నగలు పెట్టుకోవాలి..? ఇందుకోసం భవిష్యత్తులో ఎలాంటి పన్ను వివాదం రాకుండా ఉండాలంటే బంగారు ఆభరణాల విషయంలో ఆదాయపు పన్ను నిబంధనలను తెలుసుకోవడం ముఖ్యం.

మీరు ఎంత బంగారం ఉంచుకోవచ్చు

ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకోకుండా ఉండాలంటే ఇంట్లో ఎంత బంగారు ఆభరణాలు ఉంచాలన్నది మొదటి ప్రశ్న. బంగారం లేదా నగలు కొనుగోలు చేసేటప్పుడు అందుకు సంబంధించిన బిల్లులు మీ వద్ద ఉంచుకోవడం తప్పనిసరి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సర్క్యులర్‌లో బంగారు ఆభరణాలను కలిగి ఉండటానికి ఎటువంటి పరిమితి లేదని, అయితే మీరు దాని మూలాన్ని కూడా చెప్పవలసి ఉంటుందని గుర్తించుకోవాలి. మీకు ఎప్పుడైనా బంగారు ఆభరణాలకు సంబంధించి వివరాలు అడిగితే మీరు కొనుగోలు సమయంలో తీసుకున్న అదే స్లిప్‌ను చూపించాలి. అటువంటి పరిస్థితిలో పన్ను శాఖ మీపై ఎటువంటి చర్య తీసుకోదు.

ఇవి కూడా చదవండి

మీరు బంగారంపై 10 వేలు సంపాదిస్తూ 50 లక్షల విలువైన బంగారం ఇంట్లో పట్టుబడింది అనుకుందాం.. అప్పుడు మీరు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. అంత విలువైన బంగారం ఇంట్లో ఎక్కడిదనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. పూర్తి వివరాలు ఇవ్వకపోతే, పన్ను శాఖ లేదా CBDT మీ బంగారాన్ని జప్తు చేయవచ్చు.

వివాహిత మహిళ 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. అవివాహిత మహిళ 250 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. ఒక మనిషి 100 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. ఓ ఇంట్లో పట్టుబడిన బంగారాన్ని జప్తు చేయాలా వద్దా అనేది విషయాన్ని అధికారి నిర్ణయించాలి. కొన్ని కుటుంబాలు వారి ఆచారాలు, నమ్మకాల ఆధారంగా బంగారు పరిమితిని నిర్ణయించాయి. ఈ బంగారం అతని కుటుంబ సభ్యునికి మాత్రమే చెందాలి. మీ ఇంట్లో వేరొకరి బంగారాన్ని ఉంచితే, దానిని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు.

పెట్టుబడి రుజువు అవసరం

బంగారం మీదే అని నిరూపించాలంటే రుజువు ఇవ్వాల్సిందే. ఇది ఆదాయపు పన్ను రిటర్న్‌లో చూపించాల్సిన పెట్టుబడి రుజువు. దీని కోసం మీరు పన్ను ఇన్‌వాయిస్‌ని చూపవచ్చు. బంగారం బహుమతిగా లేదా వారసత్వంగా వచ్చినట్లయితే, మీరు ముందుగా దాని యజమాని రశీదును చూపవచ్చు. బంగారం వారసత్వంగా వచ్చినట్లయితే, మీరు కుటుంబ సెటిల్‌మెంట్ డీడ్‌ను రుజువుగా చూపవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..