LIC PMVVY scheme: రిటైర్మెంట్ తర్వాత మంచి ఆదాయం రావాలనుకుంటున్నారా.? అయితే ఈ పెన్షన్ స్కీమ్ మీకోసమే..
LIC PMVVY scheme: రిటైర్మెంట్ తర్వాత ఆదాయం రావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ నెల కచ్చితంగా పెన్షన్ పొందాలనే ఆలోచనలో ఉన్నారా.? అయితే ఎల్‌ఐసీ అందిస్తోన్న ఈ పాలసీ మీకోసమే. ప్రధాన మంత్రి వయ వందన యోజన పేరుతో...
LIC PMVVY scheme: రిటైర్మెంట్ తర్వాత ఆదాయం రావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ నెల కచ్చితంగా పెన్షన్ పొందాలనే ఆలోచనలో ఉన్నారా.? అయితే ఎల్‌ఐసీ అందిస్తోన్న ఈ పాలసీ మీకోసమే. ప్రధాన మంత్రి వయ వందన యోజన పేరుతో తీసుకొచ్చిన ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చూస్తుంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్లు ఈ స్కీమ్‌కు అర్హులు. ఈ పథకంపై ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో భాగంగా గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం పదేళ్లు. రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ. 9250 గ్యారంటీ పెన్షన్ పొందొచ్చు.
ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం 7.4 శాతం ఉన్న వడ్డీ అప్పటికే మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్‌లో చేరడానికి ఎలాంటి వయసు పరిమితి లేదు. పీఎంవీవీవై పథకంలో చేరిన వారికి పెన్షన్ పొందటానికి కూడా పలు ఆప్షన్స్ ఉన్నాయి. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఎంచుకున్న ఆప్షన్ బట్టి వడ్డీ రేటు మారుతుంది. నెల వారీ పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే 7.4 శాతం, మూడు నెలలకు 7.45 శాతం, ఆరు నెలలకు 7.52 శాతం, ఏడాదికి 7.66 శాతం వడ్డీ లభిస్తుంది.
ఒకవేళ పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే.. అప్పటి వరకు పెట్టుబడిగా పెట్టిన మొత్తాన్ని నామినీకి అందిస్తారు. ఈ పథకంలో నెలకు కనిష్టం రూ. 1000 , గరిష్టం రూ. 9,250 వరకు పెన్షన్‌ను అందిస్తారు. నెలకు రూ. 1000 పెన్షన్ కావాలంటే రూ. 1.62 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే నెలకు రూ. 9250 పెన్షన్ కావాలంటే రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఇక పథకం గడువుకాలం ముగిశాక పాలసీదారుడికి ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..