AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Plan: మూడేళ్లలో రూ.6 లక్షల రాబడి.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన ఈ స్పెషల్ ప్లాన్ ఏంటంటే?

Systematic Investment Plan: క్వాంట్ అబ్సొల్యూట్ ఫండ్‌లో సిప్ ద్వారా రూ. 10,000 పెట్టుబడి పెడితే, అది మూడేళ్లలో రూ. 6.17 లక్షల రాబడిని అందించింది. గత మూడేళ్లలో ఫండ్‌లో వచ్చిన 31.99 శాతం రాబడి దీనికి అతిపెద్ద సహకారం అందించింది.

Investment Plan: మూడేళ్లలో రూ.6 లక్షల రాబడి.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన ఈ స్పెషల్ ప్లాన్ ఏంటంటే?
Systematic Investment Plan
Venkata Chari
|

Updated on: Aug 21, 2022 | 12:37 PM

Share

Systematic Investment Plan: కేవలం 10,000 రూపాయల పెట్టుబడి 6 లక్షలకు పెరిగి, పెట్టుబడిదారులకు విపరీతమైన లాభాలు అందించింది. అది కూడా కేవలం 3 సంవత్సరాలలోనే కావడం విశేషం. ఇంతకంటే మంచి లాభదాయకమైన రాబడి ఎందులో ఉంటుంది? ఈ డీల్ ఎలా ఉంది, దీనిలో ఎలా పెట్టుబడి పెట్టాలని ఆనుకుంటున్నారా.. అయితే, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మ్యూచువల్ ఫండ్స్‌‌లో రాబడి సాధారణ పెట్టుబడుల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ రాబడులు కావాలంటే, మీరు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలి. కానీ, ఈ రోజు మనం ఇటువంటి మ్యూచువల్ ఫండ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం 3 సంవత్సరాలలో 10,000 రూపాయలను 6 లక్షలకు మార్చింది. ఈ ఫండ్ పేరు క్వాంట్ అబ్సొల్యూట్ ఫండ్-డైరెక్ట్ ప్లాన్.

క్వాంట్ అబ్సొల్యూట్ ఫండ్-డైరెక్ట్ ప్లాన్ 5 స్టార్ రేట్ ఇచ్చారు. ఈ ఫండ్ 1 జనవరి 2013న ప్రారంభమైంది. 30 జూన్ 2022 నాటికి, నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తి అంటే ఈ ఫండ్ AUM రూ. 499.87 కోట్లు. ఈ ఫండ్ NAV 19 ఆగస్టు 2022 నాటికి రూ. 310.91గా నిలిచింది. ప్రస్తుతం, ఈ ఫండ్‌లో 79.41 శాతం వాటా ఈక్విటీలో, 13.39 శాతం డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టింది. ఫండ్ ప్రారంభమైనప్పటి నుంచి సగటు రాబడి 17.96 శాతం ఇవ్వగా, ఏడాది పొడవునా సగటు రాబడి 16.58 శాతంగా నిలిచింది.

SIP ప్రయోజనాలు..

ఇవి కూడా చదవండి

మీరు మ్యూచువల్ ఫండ్‌లను మరింత లాభదాయకంగా మార్చాలనుకుంటే, మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటే SIPని ప్రారంభించవచ్చు. క్వాంట్ అబ్సొల్యూట్ ఫండ్‌లో రూ. 10,000 SIP మూడేళ్లలో రూ. 6.17 లక్షల రాబడిని ఇచ్చింది. గత మూడేళ్లలో ఫండ్‌లో వచ్చిన 31.99 శాతం రాబడి దీనికి అతిపెద్ద సహకారం. ఐదేళ్ల క్రితం ఈ ఫండ్‌లో ప్రారంభించిన 10,000 SIP గత ఐదేళ్లలో ఈ ఫండ్ 19.93 శాతం రాబడిని అందించగా ప్రస్తుతం రూ.11.86 లక్షల రాబడిని ఇస్తోంది. రూ.10,000 ఎస్‌ఐపీని ఏడేళ్ల క్రితమే ప్రారంభించి ఉంటే, ఈరోజు ఇన్వెస్టర్ చేతిలో రూ.18.86 లక్షలు ఉండేవి. గత ఏడేళ్లలో ఈ ఫండ్ 17.42 శాతం రాబడిని ఇచ్చింది.

ఏ ఫండ్‌లో ఎంత రాబడి ఉంటుందంటే..

GoI, ITC లిమిటెడ్, ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, UPL లిమిటెడ్ క్వాంట్ అబ్సొల్యూట్ ఫండ్-డైరెక్ట్ ప్లాన్ 5 పెద్ద హోల్డింగ్‌లలో ఉన్నాయి. ఫండ్ మూడు సేవల కేటాయింపులను కలిగి ఉంది. అవి ఫైనాన్షియల్, కన్స్యూమర్ స్టేపుల్స్, మెటీరియల్స్, కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్. అలాంటి మరొక ఫండ్ క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్-డైరెక్ట్ ప్లాన్. ఇది జనవరి 1, 2013న ప్రారంభించారు. ఇది కూడా రూ. 334.75 కోట్ల AUMతో 5 స్టార్ రేటెడ్ ఫండ్. ఈ ఫండ్ NAV 19 ఆగస్టు 2022 నాటికి రూ. 84.98గా నమోదైంది. మూడేళ్ల క్రితం ఈ ఫండ్‌లో రూ. 10,000 ఉన్న SIP ఈ ఫండ్ మూడేళ్లలో 31.10 శాతం రాబడిని ఇవ్వడంతో నేడు రూ. 6.16 లక్షలకు మారింది. 5 సంవత్సరాలలో రూ. 10,000 SIP రూ. 11.94 లక్షలు, 5 సంవత్సరాలలో ఈ ఫండ్ 19.35 శాతం రాబడిని ఇచ్చింది.