MS-Word: వర్డ్ డాక్యూమెంట్లో ఒక పేజీని ఎలా డిలీట్ చేయాలి? ఈ సింపుల్ షార్ట్ కట్స్ ఫాలో అవ్వండి చాలు..
అయితే కొన్ని షార్ట్ కట్ లను నేర్చుకోవడం ద్వారా పని సులభతరం అవడంతోపాటు సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా వందలు, పదుల సంఖ్యలో పేజీలు ఉన్నప్పుడు మధ్యలో ఒక పేజీని డిలీట్ చేయాలంటే షార్ట్ కట్స్ తెలియకపోతే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది.
మైక్రోసాఫ్ట్ వర్డ్.. ప్రస్తుతం విద్యార్థుల నుంచి బిజినెస్ మెన్ వరకూ అందరూ విరివిగా వాడుతున్నారు. తమ అవసరాలకు, ప్రాజెక్టు డాక్యూమెంటేషన్ కోసం.. నోటీసుల కోసం.. లెటర్ల కోసం.. ఇలా అనేక రకాలుగా దీనిని వినియోగిస్తుంటారు. వాస్తవానికి చాలా మంది దీనిపై సరైన అవగాహన లేకుండా వినియోగించేస్తూ ఉంటారు. షార్ట్ కట్లను తెలుసుకోకుండా వాడేస్తుంటారు. ఇది పని భారాన్ని పెంచినట్లు అవుతుంది. అయితే కొన్ని షార్ట్ కట్ లను నేర్చుకోవడం ద్వారా పని సులభతరం అవడంతోపాటు సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా వందలు, పదుల సంఖ్యలో పేజీలు ఉన్నప్పుడు మధ్యలో ఒక పేజీని డిలీట్ చేయాలంటే షార్ట్ కట్స్ తెలియకపోతే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మీ వర్డ్ డాక్యూమెంట్ లో మీకు అవసరం లేని ఓ పేజీని సులభమైన పద్దతిలో ఎలా డిలీట్ చేయాలి? దానికి ఉన్న షార్ట్ కట్స్ గురించి తెలుకుందాం..
వాటంతట అవే వచ్చేస్తాయి..
సాధారణంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యూమెంట్లో మీరు టైప్ చేస్తున్నప్పుడు ఒక పేజీ అయిపోగానే అది ఆటోమేటిక్ రెండో పేజినీ తీసుకుంటుంది. ఒక బ్లాంక్ పేజీలో మీరు ఏదైనా టైప్ చేయాలంటే దానిలో మర్జిన్స్, హెడర్, ఫూటర్ వంటివి సెట్ చేసుకోవడం ఇబ్బంది గా మారుతుంది. అలాంటి సందర్భంలో ఒక బ్లాంక్ పేజీలో మొదటి నుంచి ప్రారంభించాలనుకున్నప్పుడు కీ బోర్డ్ నుంచి Ctrl + Enter or Command + Return కీలను ప్రెస్ చేస్తే సరిపోతుంది. పేజీ డిలీట్ చేయడానికి కొన్ని షార్ట్ కట్స్ ఇప్పుడు చూద్దాం..
Ctrl + Page Up కీతో..
మీ విండోస్ లో సింగిల్ పేజీ మాత్రమే మీకు కావాలి అనుకున్నప్పుడు, దానిలో ని కంటెంట్ తో కూడా సంబంధం లేదు అనుకున్నప్పుడు మీకు కావాల్సిన పేజీకి కింద.. వద్దు అనుకున్న పేజి మొదట్లో కర్సర్ ను ఉంచి Delete కీ ని ప్రెస్ చేస్తే చాలు.. మీకు అవసరం లేని కింద పేజీలు డిలీట్ అయిపోతాయి. అలాగే మీరు ఒక బ్లాంక్ పేజీ మొదటికి వెళ్లాలి అనుకుంటే Ctrl + Page Up షార్ట్ కట్ ను వినియోగించవచ్చు. ఇది బ్లాంక్ పేజీలకు మాత్రమే పనిచేస్తుంది.
నావిగేషన్ బార్ వినియోగించుకోవచ్చు..
వర్డ్ డాక్యూమెంట్ ఓపెన్ చేసిన తర్వాత టాప్ లో ఉన్న మెనూ వద్దకు వెళ్లి View tab ని క్లిక్ చేయాలి.. దానిలో నుంచి Navigation అనే పిన్ ను క్లిక్ చేయాలి. దానిలో Pages ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వాటిల్లో ఒక ఖాళీ పేజీని, మీరు డిలీట్ చేయాలనుకుంటున్న పేజీని సెలెక్ట్ చేసి డీలీట్ కీ ని ప్రెస్ చేయాలి. డీలీట్ చేయాలనుకుంటున్న పేజీని సెలక్ట్ చేసినప్పుడు బ్లూ బోర్డర్ తో ఆ పేజీ సెలెక్ట్ అయ్యి కనిపిస్తుంది. అప్పుడు డిలీట్ కీ ప్రెస్ చేయాలి.
ఒక పేజీని డీలీట్ చేయడం ఎలా..
వర్డ్ డాక్యూమెంట్ లో ఏదైనా ఒక పేజీని ఎటువంటి షార్ట్ కట్ లేకుండా కూడా డిలీట్ చేయొచ్చు. దాని కోసం సింపుల్ గా కీబోర్డ్ లో page break ఆప్షన్ ఉంటుంది. దానిని ప్రెస్ చేయడం ద్వారా మీకు అవసరం లేని పేజ్ ని డిలీట్ చేసేయొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం