Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahindra: పండుగ వేళ కారు కొనాలనుకునేవారికి బిగ్ షాక్ ఇచ్చిన ‘మహీంద్రా’.. ఆ కారు ధర భారీగా పెంపు..

Mahindra: అసలే పండుగ సీజన్.. చాలా మంది వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ సీజన్‌లో రేట్లు తగ్గుతాయని భావించి ఎదురు చూస్తుంటారు.

Mahindra: పండుగ వేళ కారు కొనాలనుకునేవారికి బిగ్ షాక్ ఇచ్చిన ‘మహీంద్రా’.. ఆ కారు ధర భారీగా పెంపు..
Mahindra
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 25, 2022 | 7:57 PM

Mahindra: అసలే పండుగ సీజన్.. చాలా మంది వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ సీజన్‌లో రేట్లు తగ్గుతాయని భావించి ఎదురు చూస్తుంటారు. ఎదురు చూడటమే కాదు.. పండుగ సీజన్‌లో భారీగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, పండుగ వేళ కారు కొనుగోలు చేద్దామని ఎదురు చూస్తున్నవారికి బిగ్ షాక్ ఇచ్చింది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ. బొలెరో బి4 కారు ధరను భారీగా పెంచేసింది. కారు ఎక్స్‌ షోరూమ్ ధరపై రూ.20,000 వేలు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. ధర పెరగకముందు బొలెరో ధర రూ. 9.31 లక్షలు ఉండగా, తాజా పెంపుతో ధర రూ.9.53 లక్షలకు పెరిగింది. అదే సమయంలో కంపెనీ బొరెలో బి6 ధరను రూ. 22,701 పెంచింది. ఇంతకు ముందు ఈ మోడల్ ధర రూ. 9.77 లక్షలు ఉండేది, ఇప్పుడు పెంచిన ధరతో కలిపి రూ. 10 లక్షలకు చేరింది.

ఇక మహీంద్ర బొలెరో B6(0) మోడల్ ధర కూడా పెంచారు. సుమారు రూ. 22,000 పెరిగింది. గతంలో ఈ మోడల్ ధర రూ. 10.26 లక్షలు కాగా, ఇప్పుడు ధర రూ. 10.48 లక్షలకు పెరిగింది. బొలెరో నియో ధరను కూడా పెంచారు. గతంలో ఈ కారు ధర రూ. 9.31 లక్షలు(ఢిల్లీ ఎక్స్‌-షోరూమ్), పెరిగిన ధరతో కలిపి రూ. 9.53 లక్షలకు చేరింది. అంటే రూ. 20,502 పెంచడం జరిగింది. అదే సమయంలో మహీంద్రా బొలెరో టాప్ వేరియంట్ ధర కూడా రూ. 11.79 లక్షల నుంచి రూ. 11.99 లక్షలకు పెంచింది.

కార్ల మార్కెట్‌లో బొలెరో 20 సంవత్సరాలుగా ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తోంది. ఈ కారు క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అదే సమయంలో కంపెనీ.. ఈ కారు మోడల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంది. మహీంద్రా కంపెనీకి సంబంధించి ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో బొలెరో ఒకటి. కంపెనీ ఇప్పటి వరకు 13 లక్షలకు పైగా కార్లను విక్రయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కొంటెతనంతో ఆకట్టుకుంటున్న కాయదు..ఈ అమ్మడు రేర్ ఫొటోస్ చూశారా!
కొంటెతనంతో ఆకట్టుకుంటున్న కాయదు..ఈ అమ్మడు రేర్ ఫొటోస్ చూశారా!
Viral Video: అంతరిక్ష కేంద్రంలో జపాన్‌ వ్యోమగామి బేస్‌బాల్‌ గేమ్‌
Viral Video: అంతరిక్ష కేంద్రంలో జపాన్‌ వ్యోమగామి బేస్‌బాల్‌ గేమ్‌
30శాతం కమీషన్లు..! అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ భట్టి విక్రమార్క..
30శాతం కమీషన్లు..! అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ భట్టి విక్రమార్క..
పోటుగాడురా పంత్.! డకౌట్‌లోనూ డబ్బుల సంపాదనే..
పోటుగాడురా పంత్.! డకౌట్‌లోనూ డబ్బుల సంపాదనే..
ఓరి దేవుడా.! మనుషుల్లా మారిన పెంగ్విన్లు ఏం చేస్తున్నాయో తెలిస్తే
ఓరి దేవుడా.! మనుషుల్లా మారిన పెంగ్విన్లు ఏం చేస్తున్నాయో తెలిస్తే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగే వారికి అలర్ట్‌..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగే వారికి అలర్ట్‌..
డైరెక్ట్‌గా రోహిత్‌పై సిరాజ్‌ కామెంట్స్‌! ఏమన్నాడంటే..?
డైరెక్ట్‌గా రోహిత్‌పై సిరాజ్‌ కామెంట్స్‌! ఏమన్నాడంటే..?
రాజస్థాన్‌ టోంక్ ఫామిలీ టూర్ కోసం బెస్ట్.. ఏమి చూడొచ్చు అంటే.?
రాజస్థాన్‌ టోంక్ ఫామిలీ టూర్ కోసం బెస్ట్.. ఏమి చూడొచ్చు అంటే.?
వేసవికి విమానయాన ప్రరిశ్రమ భారీ ప్లాన్.. విమాన సర్వీసుల పెంపు
వేసవికి విమానయాన ప్రరిశ్రమ భారీ ప్లాన్.. విమాన సర్వీసుల పెంపు
మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ వచ్చేసింది..
మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ వచ్చేసింది..