AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Carats: బంగారం స్వచ్ఛతను ఎలా లెక్కిస్తారు..? 24, 22 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి..?

Gold Carats: బంగారం.. దీని పేరు వినగానే మహిళలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంటుంది. బంగారం అంటే ఎంతో ఆసక్తి చూపుతారు. ధరలు ఎంత పెరిగినా దేశంలో కొనుగోళ్లు మాత్రం..

Gold Carats: బంగారం స్వచ్ఛతను ఎలా లెక్కిస్తారు..? 24, 22 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి..?
Gold Carats
Subhash Goud
|

Updated on: Sep 25, 2022 | 8:23 PM

Share

Gold Carats: బంగారం.. దీని పేరు వినగానే మహిళలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంటుంది. బంగారం అంటే ఎంతో ఆసక్తి చూపుతారు. ధరలు ఎంత పెరిగినా దేశంలో కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. అయితే పండగ సీజన్‌, పెళ్లిళ్ల సీజన్‌లలో మాత్రం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. అయితే పసిడి కొనుగోలు చేసేవారు ముందుగా ఈ టిప్స్‌ను గుర్తించుకోవడం మంచిదంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు.

బంగారం స్వచ్ఛతను ఎలా లెక్కిస్తారు..?

బంగారం స్వచ్ఛతను క్యారెట్‌లతో లెక్కిస్తారు. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు ఉంటుంది. స్వచ్ఛమైన బంగారంతో గోల్డ్‌ కాయిన్స్‌, గోల్డ్‌ బార్స్‌, గోల్డ్‌ బిస్కెట్స్‌ మాత్రమే లభిస్తాయి. అభరణాల తయారీ కోసం ఉపయోగించే బంగారం 22 క్యారెట్‌ కూడా ఉంటుంది. ఎవరైనా అభరణాలు చూపించి ఇవి 24 క్యారెట్‌అని చెబితే నమ్మి మోసపోవద్దు. 24 క్యారెట్‌ బంగారం అభరణాలు తయారు చేయాలంటే అందులో ఇతర మెటల్స్‌ని కలుపాల్సి ఉంటుంది. అందుకే అభరణాలు 22 క్యారెట్‌తో ఉంటాయి. ఇక 22 క్యారెట్‌ జ్యువెలరీ మాత్రమే కాదు.. 18 క్యారెట్‌ నగలు కూడా ఉంటాయి. ఇందులో బంగారం స్వచ్ఛత తక్కువగా ఉంటుందని గమనించాలి. 18 క్యారెట్‌ నగలనే 22 క్యారెట్‌ అని నమ్మించి మోసం చేసే అవకాశాలు చాలా మందే ఉంటారు. అందుకే నగలను ఎంపిక చేసుకునేటప్పుడు అది 22 క్యారెట్‌ నగలా.. 18 క్యారెట్‌ నగలా అన్న విషయాన్ని తెలుసుకోవడం మర్చిపోవద్దు. ఆనగలపై హాల్‌ మార్క్‌తో పాటు నగల స్వచ్ఛతను చూపించే ముద్రను గమనించాలి. 22k అని ముద్రించి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

22 క్యారెట్లు.. 24 క్యారెట్లలో తేడాలు:

బంగారంలో 22 క్యారెట్లు, 24 క్యారెట్లలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు అనేవి కొందరికి తెలిసినా.. కొందరికి తెలియదు. ఈ రెండింటికి తేడాలు ఏమిటో బంగారం కొనుగోలు చేసేవారికి ఎక్కువగా తెలుస్తుంటుంది. కానీ కొందరికి మాత్రం ఈ క్యారెట్ల విషయంలో చాలా అనుమానాలుంటాయి. క్యారెట్‌ అనేది స్వచ్ఛతకు నిదర్శనం. క్యారెట్‌ వాల్యూ పెరిగే కొద్ది బంగారం స్వచ్ఛత పెరుగుతుంది. ఫలితంగా ధర కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారం స్వచ్ఛతను 0 నుంచి 24 వరకు లెక్కిస్తారు. అయితే పసిడి ఎంతో సున్నితమైనది. దీనికి రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలిస్తే బలపడి ఆభరణాలు చేయడం సాధ్యపడుతుంది. బంగారం, ఇతర లోహాల మిశ్రమాలు ఏ మోతాదులో కలిశాయనేది కూడా క్యారెట్‌ తెలుపుతుంది.

  1. 24 క్యారెట్ల బంగారం: ఈ క్యారెట్‌లో బంగారం 99.9 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. 24 క్యారెట్ల బంగారానికి మించిన బంగారం ఉండదు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ఖరీదైనది. ఈ బంగారు సున్నితమైనది. ఇందులో ఏ ఇతర లోహం కలిసి ఉండదు. కేవలం బంగారమే ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం అని చెబితే అందులో 99.99 శాతం బంగారమే ఉంటుందని గుర్తించాలి. దీనిని 999 బంగారం అని కూడా పిలుస్తారు. 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉంటుంది. అయితే ఈ క్యారెట్‌లో 100 శాతం బంగారం ఉండవచ్చు కదా.. అని అనుమానం రావచ్చు.అయితే 100 శాతం స్వచ్ఛత ఉన్న బంగారం సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద చాలా మృదువుగా, పెళుసుగా ఉంటుంది. ఒక ఆకారంలోఉండదు. అందుకే బంగారాన్ని వెలికి తీసిన తర్వాత 99.99శాతం స్వచ్ఛత వచ్చే విధంగా చేస్తారు. ఇదే అత్యంత స్వచ్ఛమైన బంగారమని భావించాలి.
  2. 22 క్యారెట్ల బంగారం: ఈ క్యారెట్ల బంగారంలో రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి మెటల్స్ ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం కంటే ఇది హార్డ్‌గా ఉంటుంది. ఆభరణాల తయారీకి ఇది అనువైంది. ఇది 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం. ఈ బంగారాన్ని 916 బంగారం అని కూడా పిలుస్తుంటారు. ఈ బంగారానికి ఇతర లోహాలు కలపడం వల్ల గట్టి పడుతుంది.
  3. 18 క్యారెట్ల బంగారం: 18 క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది. ఇందులో ఉండే బంగారంలో ఆరు భాగాల ఇతర మెటల్స్ ఉంటాయి. దీనిని 750 బంగారం అని కూడా పిలుస్తుంటారు.18 క్యారెట్ల బంగారంలో 75 శాతం పసిడి, 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత హార్డ్‌గా, మన్నికగా ఉంటుంది. ఇన్వెస్ట్‌ మెంట్‌ కోసం అయితే 24 క్యారెట్ల బంగారం వైపు మొగ్గు చూపుతుంటారు. డైమండ్‌ జువెలరీ తయారీలో 18కే బంగారం ఎక్కువగా వాడతారు. 18 క్యారెట్ల బంగారం కన్నా 22 క్యారెట్ల బంగారం ధర ఎక్కువగా ఉంటుంది.
  4. 14 క్యారెట్ల బంగారం: ఈ క్యారెట్‌ బంగారంలో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర తక్కువ ఉంటుంది. మార్కెట్లో 10 క్యారెట్లు, 9 క్యారెట్ల బంగారం కూడా లభ్యం అవుతుంది. బంగారం స్వచ్ఛతను ఫైన్‌నెస్, దాని రంగును బట్టి గుర్తించవచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండటంతోపాటు డార్కిష్‌గా ఉంటుంది. ఇతర లోహాలు కలిసేకొద్దీ బంగారం రంగు మారుతుంది. వైట్ గోల్డ్‌లో నికెల్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వివరాలను బులియన్‌ మార్కెట్‌ నిపుణుల ఆధారంగా మీకు అందించడం జరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్