RBI: మరో సహకార బ్యాంకుపై ఆర్బీఐ కఠిన చర్యలు.. లైసెన్స్ రద్దు.. కస్టమర్ల డబ్బు సంగతేంటి..!
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు చేపడుతోంది. కొన్ని బ్యాంకుల లావాదేవీలపై ఆంక్షలు విధిస్తుంటే, మరి కొన్ని..
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు చేపడుతోంది. కొన్ని బ్యాంకుల లావాదేవీలపై ఆంక్షలు విధిస్తుంటే, మరి కొన్ని బ్యాంకుల లైసెన్స్‌లనే రద్దు చేస్తోంది ఆర్బీఐ. ఇక తాజాగా మరో బ్యాంకుపై చర్యలు చేపట్టింది. మహారాష్ట్రకు చెందిన లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేసింది . ఆర్‌బిఐ తెలిపిన వివరాల ప్రకారం.. షోలాపూర్‌లో ఉన్న ఈ సహకార బ్యాంకుకు తగినంత మూలధనం లేదు. సంపాదించే మార్గం లేదు. లక్ష్మీ సహకరి బ్యాంకు నిబంధనలను సరిగా పాటించలేదని ఆర్‌బీఐ పేర్కొంది. దీంతో బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సహకార బ్యాంకులో ఖాతాదారులు డిపాజిట్ చేసిన తమ డబ్బు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకుపై చర్య అనంతరం ఆర్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఉన్న లక్ష్మీ సహకారి బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించకుండా నిషేధించబడింది. లక్ష్మీ సహకారి బ్యాంక్‌పై బ్యాంకింగ్ చట్టం, 1949 ప్రకారం తక్షణమే అమలులోకి వచ్చేలా చర్య తీసుకోబడింది.
లక్ష్మీ సహకారి బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసిన ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కస్టమర్ల మూలధనం ప్రభుత్వం నిర్వహించే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) కింద రక్షణ ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఈ పథకం కింద లక్ష్మీ సహకరి బ్యాంక్ ఖాతాదారులకు రూ.5 లక్షల వరకు తిరిగి ఇవ్వబడుతుంది. ఏదైనా ప్రైవేట్, వాణిజ్య లేదా సహకార బ్యాంకు రద్దు అయితే ఖాతాదారుల డబ్బును సురక్షితంగా ఉంచడానికి ఈ హామీ పథకం ఇటీవలి సంవత్సరంలో ప్రారంభించబడింది. అయితే ఇందులో రూ.5 లక్షల వరకు గ్యారెంటీ ఉంది. లక్ష్మీ సహకారి బ్యాంక్‌లో 90 శాతం మంది ఖాతాదారులు రూ. 5 లక్షల వరకు తిరిగి పొందనున్నారు.
డబ్బు ఎలా లెక్కించబడుతుంది?
డిఐసిజిసి చట్టం ప్రకారం, అసలు, వడ్డీ మొత్తాన్ని కలిపి కస్టమర్‌కు రూ.5 లక్షల వరకు ఇవ్వబడుతుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ ఖాతాలో రూ. 4,95,000 మొత్తం ఉందనుకోండి.. అతనికి రూ. 4,000 వడ్డీని వస్తే అప్పుడు బ్యాంకు మునిగిపోయినప్పుడు కస్టమర్ రూ. 4,99,000 పొందుతారు. కస్టమర్ గరిష్టంగా రూ. 5 లక్షలు పొందేందుకు హామీ ఇవ్వబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి