AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: ఇప్పుడు మీ రైలు మిస్ అవ్వదు.. ఇస్రోతో జతకట్టిన ఇండియన్‌ రైల్వే.. సరికొత్త టెక్నాలజీ

Indian Railway: చాలా సార్లు మీరు స్టేషన్‌కి వెళ్లి మీ రైలు కోసం గంటల ముందు వేచి ఉండాల్సి వస్తుంటుంది. చాలా సార్లు మీకు రైలు మిస్సైపోతుంటుంది. ఇలాంటి సమయంలో..

Indian Railway: ఇప్పుడు మీ రైలు మిస్ అవ్వదు.. ఇస్రోతో జతకట్టిన ఇండియన్‌ రైల్వే.. సరికొత్త టెక్నాలజీ
Indian Railway
Subhash Goud
|

Updated on: Sep 24, 2022 | 9:39 PM

Share

Indian Railway: చాలా సార్లు మీరు స్టేషన్‌కి వెళ్లి మీ రైలు కోసం గంటల ముందు వేచి ఉండాల్సి వస్తుంటుంది. చాలా సార్లు మీకు రైలు మిస్సైపోతుంటుంది. ఇలాంటి సమయంలో రైలు ప్రయాణం కాకుండా మరే ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాల్సిన వస్తుంటుంది. అయితే ఇప్పుడు ఈ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త ఇది. ఇప్పుడు మీరు ఈ సమస్యల నుండి బయటపడతారు. ట్రాక్‌పై నడుస్తున్న రైలు ప్రతి క్షణం తాజా అప్‌డేట్స్‌ మీ మొబైల్‌కు వస్తుంటుంది.

2700 లోకోమోటివ్‌లలో పరికరాలు

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే 2700 లోకోమోటివ్‌ల కోసం రియల్ టైమ్ రైలు సమాచార వ్యవస్థ (RTIS) పరికరాలను ఏర్పాటు చేసింది. దీనితో రైలు సంబంధిత సమాచారం ప్రతి 30 సెకన్లకు నవీకరించబడుతుంది. ఇస్రో సహకారంతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది రైల్వే శాఖ.

ఇవి కూడా చదవండి

ప్రతి 30 సెకన్లకోసారి అప్‌డేట్స్‌:

రైళ్ల రాక, నిష్క్రమణ లేదా రిహార్సల్‌తో సహా స్టేషన్‌లలో రైలు కదలిక సమయాలను పొందడానికి RTIS లోకోమోటివ్‌లలో ఇన్‌స్టాల్ చేయబడుతోంది. కంట్రోల్ ఆఫీస్ అప్లికేషన్ (COA) సిస్టమ్‌లో అవి ఆటోమేటిక్‌గా రైళ్ల కంట్రోల్ చార్ట్‌లపై పట్టికలను సిద్ధం చేస్తాయి. RTIS 30 సెకన్ల వ్యవధిలో మధ్య విభాగాన్ని అప్‌డేట్ చేస్తుంది. రైలు నియంత్రణ ఇప్పుడు మానవ ప్రమేయం లేకుండా RTIS ప్రారంభించబడిన లోకోమోటివ్‌లు/రైళ్ల స్థానాన్ని, వేగాన్ని మరింత నిశితంగా పర్యవేక్షిస్తుంది.

ఇప్పుడు మరో 6000 ఇంజన్లు కవర్ చేయబడతాయి. దేశవ్యాప్తంగా 21 ఎలక్ట్రిక్ లోకో షెడ్‌లలో 2700 లోకోమోటివ్‌ల కోసం RTIS పరికరాలు అమర్చబడతాయని రైల్వే శాఖ తెలిపింది. దీని తరువాత రోల్ అవుట్ రెండవ దశలో ISRO SATCOM హబ్‌ని ఉపయోగించి 50 లోకో షెడ్‌లలో మరో 6000 లోకోమోటివ్‌లు ఈ ప్లాన్‌లో చేర్చబడతాయి. ప్రస్తుతం సుమారు 6500 లోకోమోటివ్‌లు (RTIS, REMMLOT) నేరుగా కంట్రోల్ ఆఫీస్ అప్లికేషన్ (COA)లోకి ఫీడ్ చేయబడుతున్నాయి. దీని వల్ల ప్రయాణికులు రైళ్ల ఆటోమేటిక్ చార్టింగ్, తత్కాల్ సమాచారాన్ని సులభంగా పొందగలుగుతారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి