5G Services: దేశంలో 5G సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఎప్పుడు అంటే..!
5G Services: దేశంలో టెక్నాలజీ వేగంగా అవృద్ధి చెందుతోంది. టెక్నాలజీని ఉపయోగించుకుని రకరకాల సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అక్టోబర్..
5G Services: దేశంలో టెక్నాలజీ వేగంగా అవృద్ధి చెందుతోంది. టెక్నాలజీని ఉపయోగించుకుని రకరకాల సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 1న జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించనున్నారు. 5G సేవల (5G Services) కోసం ఎంతగానో ఎదరు చూస్తున్న ప్రజల నిరీక్షణ ముగుస్తుంది. ప్రభుత్వ జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ ఈరోజు ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. భారతదేశం డిజిటల్ పరివర్తన, కనెక్టివిటీని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో భారతదేశంలో 5G సేవలను ప్రారంభిస్తారని పేర్కొంది.
5G సేవ ప్రయోజనం ఏమిటి ..?
5G సేవలో డేటాను పంపే, స్వీకరించే వేగం గతంలో కంటే ఎక్కువ వేగంగా ఉండబోతోంది. ఇది ప్రజల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, కొత్త యుగం అనేక అనువర్తనాలను కూడా సులభంగా ఉపయోగించవచ్చు. 5G సహాయంతో కస్టమర్ అనుభవం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు లావాదేవీ నుండి ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి లేదా అప్‌లోడ్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది.
ఐదవ తరం అంటే 5G టెలికమ్యూనికేషన్ సేవల ద్వారా అధిక నాణ్యత గల ఎక్కువ సమయం ఉన్న వీడియో లేదా సినిమాలను మొబైల్, ఇతర పరికరాలలో కొన్ని సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక చదరపు కిలోమీటరులో దాదాపు లక్ష కమ్యూనికేషన్ పరికరాలను సపోర్ట్ చేస్తుంది.
ఈ సేవ సూపర్‌ఫాస్ట్ వేగాన్ని (4G కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ) అనుమతిస్తుంది. కనెక్టివిటీ ఆలస్యాలను తగ్గించడం, బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేయబడిన పరికరాలలో నిజ-సమయ డేటా షేరింగ్‌ని అనుమతిస్తుంది. దీని ద్వారా 3D హోలోగ్రామ్ కాలింగ్, మెటావర్స్ అనుభవం, విద్యాపరమైన అప్లికేషన్‌లను పునర్నిర్వచించవచ్చు.
భారతీయ వినియోగదారులు త్వరలో ఎంపిక చేసిన నగరాల్లో 5G సేవలను పొందుతారు. రాబోయే 12-18 నెలల్లో ఇతన నగరాల్లో ఈ సేవలు అందేలా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ వేగాన్ని మరింతగా పెంచేందుకు 5జీ టెక్నాలజీని అందుబాటులోకి రానుంది. దీని వల్ల అత్యంత వేగంగా నెట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఎంత పెద్ద వీడియో, ఇతర ఫైల్స్ అయిన కొన్ని సెకన్లలోనే పంపే సదుపాయం వచ్చేస్తోంది. 5జీ టెక్నాలజీ కోసం టెలికాం కంపెనీలు ట్రయల్స్‌ను కూడా వేగంగా పూర్తి చేశాయి. ఈ టెక్నాలజీని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నువ్వా నేనా అన్నట్లు టెలికాం కంపెనీలు పోటా పోటీగా ఉన్నాయి.
ఎవరికి వారు తమ కస్టమర్లకు ముందస్తుగా 5జీ టెక్నాలజీ అందించాలనే ఉద్దేశంతో తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పుడు కస్టమర్ల కల నెరవేరనుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా భారత్ ముందుకెళ్తోంది. ఈ 5జీ టెక్నాలనీ కోసం వేటం పాటలు కూడా పూర్తయ్యియి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానే వస్తోంది.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మొబైల్‌లో ఇంటర్నెట్ ఉంటుంది. నెట్ సదుపాయం లేనిది ఏ స్మార్ట్ ఫోన్ ఉండటం లేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ సదుపాయం పొందుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ సదుపాయం పెరిగిపోయింది. కరోనా మహమ్మారి తర్వాత వర్క్‌ఫ్రం హోం నిర్వహించే ఉద్యోగులకు నెట్ వినియోగం పెరిగిపోయింది. 4G కారణంగా నెట్ స్లోగా ఉండటం కొంత ఇబ్బందులు పడుతున్న వారికి ఈ 5జీ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి