AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: ఇకపై తప్పులు దిద్దుకునే అవకాశం.. ఎడిట్‌ మెసేజ్‌ ఫీచర్‌ను పరీక్షిస్తోన్న వాట్సాప్‌..

Whatsapp: వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు అంతటి ప్రాధాన్యత...

Whatsapp: ఇకపై తప్పులు దిద్దుకునే అవకాశం.. ఎడిట్‌ మెసేజ్‌ ఫీచర్‌ను పరీక్షిస్తోన్న వాట్సాప్‌..
Whatsapp
Narender Vaitla
|

Updated on: Sep 25, 2022 | 6:49 AM

Share

Whatsapp: వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు అంతటి ప్రాధాన్యత. ప్రత్యర్థి సంస్థల నుంచి ఎంత పోటీ ఎదురైనా వాట్సాప్‌ మొదటి స్థానంలో నిలవడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే పలు ఆకట్టుకునే ఆఫర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తూ వస్తోన్న వాట్సాప్‌ తాజాగా మరో ఆకస్తికరమైన ఫీచర్‌ను యూజర్లకోసం తీసుకొచ్చింది. సాధారణంగా వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్‌ చేస్తే ప్రస్తుతం డిలీట్‌ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. అలా కాకుండా అప్పటికే సెండ్ చేసిన మెసేజ్‌ను ఎడిట్‌ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.?

ఫీచర్‌ ఉపయోగం భలే ఉంది కదూ! తాజాగా వాట్సాప్‌ ఈ ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. తొందరపాటులో పంపిన మెసేజ్‌లో ఏవైనా తప్పులు దొర్లితే.. ఇకపై మెసేజ్‌ను డిలీట్‌ చేసి, మళ్లీ కొత్త మెసేజ్‌ పంపాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగపడనుంది. ఎడిట్‌ మెసేజ్‌ ఫీచర్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ అప్‌డేట్‌ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. విజయవంతంగా పరీక్షలు పూర్తికాగానే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే వాట్సాప్‌ ఇటీవలే డిలిట్ ఫర్‌ ఎవ్రీవన్‌ ఫీచర్‌ సమయాన్ని పెంచిన విషయం తెలిసిందే. వీటితో పాటు ప్రైవసీలో భాగంగా ప్రొఫైల్‌ ఫొటో ఎవరికి కనిపించాలో వారికే కనిపించేలా చేసుకునే అవకాశం కూడా కల్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!