Shocking Video: ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేదిశలో ఏకంగా 4 సుడిగుండాలు.. ఇలాంటి సీన్‌ను మీ జీవితంలో చూసుండరు..!

Shocking Video: ప్రకృతిని మించిన కళాకారుడు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్నిసార్లు ప్రకృతి చాలా అందమైన దృశ్యాలను చూపుతుంది.

Shocking Video: ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేదిశలో ఏకంగా 4 సుడిగుండాలు.. ఇలాంటి సీన్‌ను మీ జీవితంలో చూసుండరు..!
Waterspouts
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 22, 2022 | 2:03 PM

Shocking Video: ప్రకృతిని మించిన కళాకారుడు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్నిసార్లు ప్రకృతి చాలా అందమైన దృశ్యాలను చూపుతుంది. వాటిని చూసి ప్రజలు మైమరచిపోతుంటారు. అదే సమయంలో కొన్ని దృశ్యాలు ఆశ్చర్యకరంగా, భయానకంగానూ ఉంటాయి. అలాంటి వాటిలో తుపానులు, టోర్నడోలు, మొదలైన ప్రకృతి దృశ్యాల గురించి పేర్కొనవచ్చు. ఇవి ఎంతటి వినాశనాన్ని, విపత్తులను కలిగిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రకృతికి సంబంధించి అత్యంత ప్రమాదకరమైన రూపాలలో టోర్నడోలు కూడా ఒకటి. ఇకపోతే కొన్ని రకాల సుడిగాలులు చాలా భయంకరంగా ఉంటాయి. అవే సుడిగాలులను దూరంగా చూస్తే కనువిందు చేస్తాయి. తాజాగా అలాంటి ఒక బ్యూటీఫుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటజిన్లు ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

కింద సముద్రం.. పైన మేఘాలు.. కాస్త దూరంగా చూస్తే రెండూ ఒక్కటైనట్లుగా కనిపించే అద్భుత దృశ్యం. ఇంతలో మరో అద్భుతం కనువిందు చేసింది. అవును.. సముద్ర ఉపరితలంపై టోర్నడో ఏర్పడింది. దాంతో సముద్రంలోని నీరు అమాంతం ఆకాన్ని తాకుతూ పైకి లేచింది. ఆ కాసేపటికే.. మరో టోర్నడో, ఇంకాసేపటికి మరో టోర్నడో ఇలా ఒకే వరుసలో నాలుగు టోర్నడోలు ఏర్పడ్డాయి. దూరం నుంచి చూడటానికి ఎంతో అద్భుతంగా ఈ దృశ్యాలను కొందరు తమ ఫోన్ కెమెరాలో చిత్రీకరించారు. ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ బ్యూటీఫుల్ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దూరం నుంచి అందంగా ఉన్న టోర్నడోలు.. దగ్గరికి వస్తే మాత్రం ప్యాక్ అవ్వాల్సిందేనని కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

@cualify అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో 6 సెకన్ల వ్యవధితో ఉంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.6 మిలియన్లు అంటే 16 లక్షల వ్యూస్ వచ్చాయి. అంతేస్థాయిలో లైక్స్ కూడా వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?