AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇలా సెల్ఫీ దిగాలంటే నిజంగా దమ్ముండాలి.. నువ్వు మనిషివి కాదు దేవుడివి సామీ..

Viral Video: నిత్యం మన చుట్టూ తిరుగుతూ, మన వెంట ఉండే సాదు జంతువుతో సెల్ఫీ దిగాలంటేనే జడుసుకుంటాం. అలాంటిది క్రూర మృగాలతో సెల్ఫీ అంటే..

Viral Video: ఇలా సెల్ఫీ దిగాలంటే నిజంగా దమ్ముండాలి.. నువ్వు మనిషివి కాదు దేవుడివి సామీ..
Selfie
Shiva Prajapati
|

Updated on: Sep 22, 2022 | 2:03 PM

Share

Viral Video: నిత్యం మన చుట్టూ తిరుగుతూ, మన వెంట ఉండే సాదు జంతువుతో సెల్ఫీ దిగాలంటేనే జడుసుకుంటాం. అలాంటిది క్రూర మృగాలతో సెల్ఫీ అంటే.. అందులోనూ ఛాన్స్ దొరికితే కరకరా నమిలిపడేసే చిరుతతో సెల్ఫీ అంటే ఇంకేమైనా ఉందా? గుండె ఆగిపోయినంత పని అవుతుంది. కానీ, కొందరుంటారు సామీ.. వారి ధైర్యానికి సలామ్ చెప్పాల్సిందే. చిరుతను సైతం పిల్లిలా భావిస్తారు. దానితో సరదాగా ఆడేసుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి సెల్ఫీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అవును.. ఆ సెల్ఫీ అట్లాంటి ఇట్లాంటి సెల్ఫీ కాదు.. భయనాకమైన చీతాతో సెల్ఫీ. పైగా చిరునవ్వులు చిందిస్తూ దాని నోటివద్దే తల పెట్టి మరీ సెల్ఫీ దిగాడు.

వైరల్ అవుతున్న వీడియోలో కొందరు పర్యాటకులు సఫారీలో పర్యటిస్తున్నారు. ఇంతలో ఓ చీతా వారి వాహనం వైపు దూసుకొచ్చింది. సఫారీలోని పర్యాటకులు భయపడుతూనే దానిని వీడియో తీస్తుండగా.. అది ఇంకాస్త ముందుకు వచ్చి వారి వాహనంపైకి వచ్చింది. సఫారీ టాప్ నుంచి లోపలికి వచ్చే ప్రయత్నం చేసింది. మళ్లీ వెనక్కి తగ్గి.. టాప్‌పైనే హాయిగా పడుకుంది. చీతా రాకతో కొందరు పర్యాటకులు బెదిరిపోగా.. అందులోని ఒక వ్యక్తి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఫోన్ కెమెరాతో సెల్ఫీ కోసం ముందుకొచ్చాడు. చీతా టాప్‌పై పడుకోగా.. దాని ఫేస్, అతని ఫేస్ కనిపించేలా నిల్చుని సెల్ఫీ దిగాడు. చిరుత కూడా ఏమనకుండా అతనికి సెల్ఫీ పోజ్ ఇవ్వడం మరింత ఆశ్చర్యకరం. అయితే, ఈ సెల్ఫీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. అతని ధైర్యానికి అంతా ఫిదా అయిపోతున్నారు. ఇంకొందరైతే ప్రయోగాలు వద్దు.. తేడా వస్తే చీతాకు ఆహారం అయిపోతారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరు కూడా ఈ షాకింగ్ వీడియోపై ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..