Ration Card Rules: ఇలాంటి వారు రేషన్‌ పొందుతున్నారా..? అయితే మీ కార్డు రద్దు అవుతుంది.. కేంద్రం కొత్త నిబంధనలు

Ration Card Rules: దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ సౌకర్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని వచ్చే 6 నెలల పాటు పొడిగించాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది..

Ration Card Rules: ఇలాంటి వారు రేషన్‌ పొందుతున్నారా..? అయితే మీ కార్డు రద్దు అవుతుంది.. కేంద్రం కొత్త నిబంధనలు
Ration Card Rules
Follow us
Subhash Goud

|

Updated on: Sep 25, 2022 | 6:55 PM

Ration Card Rules: దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ సౌకర్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని వచ్చే 6 నెలల పాటు పొడిగించాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ఉచిత రేషన్ పథకంలో చాలా మంది అనర్హులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పలు రేషన్ కార్డులు రద్దు:

రేషన్ కార్డు రద్దుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. మీకు ఈ నిబంధనలు సరిపోలకపోతే మీ రేషన్‌ కార్డు రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ఈ సమయంలో అటువంటి వారికి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఇలాంటి నిబంధనలు గతంలోనే జారీ చేసినా.. ఇందుకు సంబంధించి మరికొన్ని నిబంధనలు జారీ చేసింది కేంద్రం. అనర్హులు ఎవరైనా ఉంటే వారు స్వచ్ఛందంగా రేషన్‌ కార్డును రద్దు చేసుకోవాలని కోరుతోంది. మీరు మీ రేషన్ కార్డును ఇంకా రద్దు చేయకుంటే ధృవీకరణ తర్వాత ఆహార శాఖ బృందం దానిని రద్దు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నియమాలు ఏమిటో తెలుసా?

మీ స్వంత ఆదాయంతో సంపాదించిన 100 చదరపు మీటర్ల ప్లాట్/ఫ్లాట్ లేదా ఇల్లు, ఫోర్ వీలర్ వెహికిల్/ట్రాక్టర్, ఆయుధ లైసెన్స్, కుటుంబ ఆదాయం గ్రామంలో రెండు లక్షలకు మించి ఉంటే, నగరంలో ఏటా మూడు లక్షలు ఉన్నవారుఆంటే వారి రేషన్ కార్డును తహసీల్‌ కార్యాలయంలో గానీ, DSO కార్యాలయంలో సరెండర్ చేయాల్సి ఉంటుంది.

కార్డు సరెండర్ చేయకపోతే చర్యలు:

నిబంధనల ప్రకారం.. రేషన్ కార్డుదారుడు కార్డును సరెండర్ చేయకపోతే విచారణ తర్వాత కార్డును రద్దు చేయబడుతుంది. అంతే కాకుండా వారి కుటుంబంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక మీడియా నివేదికల ప్రకారం.. ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. రాబోయే 3 నుండి 6 నెలల వరకు ప్రభుత్వం దానిని మరింత పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనివల్ల ప్రభుత్వానికి 10 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే