Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీకు వెక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయా? అయితే, ఈ టిప్స్‌తో ఈజీగా ఉపశమనం పొందండి..

Hiccups Problem: వెక్కిళ్లు అనేది ఒక సాధారణ సమస్య. వెక్కిళ్లు వస్తే కాసేపటి వరకు తగ్గదు. కొన్ని నిమిషాలపాటు వస్తుంది. కొన్నిసార్లు నీళ్లు తాగడం వలన పోతుంది.

Health Tips: మీకు వెక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయా? అయితే, ఈ టిప్స్‌తో ఈజీగా ఉపశమనం పొందండి..
Hiccups Problem
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 24, 2022 | 7:01 PM

Hiccups Problem: వెక్కిళ్లు అనేది ఒక సాధారణ సమస్య. వెక్కిళ్లు వస్తే కాసేపటి వరకు తగ్గదు. కొన్ని నిమిషాలపాటు వస్తుంది. కొన్నిసార్లు నీళ్లు తాగడం వలన పోతుంది. మరికొన్నిసార్లు మాత్రం నీరు తాగినప్పటికీ.. అలాగే కంటిన్యూగా వస్తుంటుంది. చాలాకాలం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే, శరీరంలో ఉండే పక్కటెముకలు, డయాఫ్రాగమ్‌ల మధ్య వెక్కిళ్ల సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఇంటర్ కాస్టల్ కండరాలు అకస్మాత్తుగా సంకోచించడం వల్ల స్పామ్ రూపంలో ఉంటుంది. ఈ ఆకస్మిక సంకోచం అకస్మాత్తుగా గొంతుపై ప్రభావం చూపుతుంది. తద్వారా వెక్కిళ్లు వస్తాయి. అయితే, వెక్కిళ్లు ఎక్కువసేపు రావడం వలన చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టే సూచనలు చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. మరి ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యాలకుల పొడి..

వెక్కిళ్లు అధికంగా వస్తే చాలా మంది మంచినీరు గానీ, నిమ్మరసం గానీ తాగుతుంటారు. కానీ, కొన్నిసార్లు అవికూడా పెద్దగా ప్రభావం చూపవు. వెక్కిళ్లు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఏలకుల పొడి ద్వారా ఉపశమనం పొందవచ్చు. అదెలా ఉపయోగించాలంటే.. ముందుగా ఒక గ్లాస్ నీటిని మరిగించాలి. అందులో కొద్దిగా యాలకుల పొడి వేయాలి. నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం తాగాలి.

ఇవి కూడా చదవండి

తీపిపదర్థాలు..

వెక్కిళ్ళు తగ్గడంలో చక్కెర కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రెసిపీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. చక్కెర రెసిపీని తీసుకోవడం చాలా ఈజీ. ఒకటి లేదా అర టీస్పూన్ పంచదార తీసుకుని నోటిలో వేసుకుని తినాలి. చక్కెర రసం చిటికెలో వెక్కిళ్లను తగ్గిస్తుంది.

నల్లమిరియాల..

ఆయుర్వేద పద్ధతిలోనూ వెక్కిళ్లకు చెక్ పెట్టొచ్చు. నల్ల మిరియాల పొడిని తీసుకోవాలి. ఆ పొడిని తినాల్సిన అవసరం లేదు. వాసన చూస్తే సరిపోతుంది. ఇందుకోసం ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. అందులో మిరియాల పొడి వేయాలి. ఆ గుడ్డ సహాయంతో వాసన పీల్చుకోవాలి. ఈ విధానంలో నిమిషాల్లోనే వెక్కిళ్లు తగ్గుతాయి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టించుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధ‌ృవీకరించడం లేదు. ఏదైనా సమస్య వస్తే ముందుగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.