Immunity: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, మీలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం..

Immunity: శరీరంలో రోగ నిరోధక శక్తి బాగుంటే.. ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే ప్రతీసారి అనారోగ్యానికి గురవుతుంటాం. చాలా మంది బయటి ఫుడ్స్ ఎక్కువగా తనిడం..

Immunity: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, మీలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం..
Immunity
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 24, 2022 | 6:33 PM

Immunity: శరీరంలో రోగ నిరోధక శక్తి బాగుంటే.. ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే ప్రతీసారి అనారోగ్యానికి గురవుతుంటాం. చాలా మంది బయటి ఫుడ్స్ ఎక్కువగా తనిడం, వర్షంలో తడవటం వలన తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే, కొందరు ఎంత తిరిగినా, ఏం తిన్నా ఆరోగ్యంగానే ఉంటారు. దీనికి కారణం రోగనిరోధక వ్యవస్థ. శరీరంలో ఇమ్యూనిటీ సరిగా ఉంటే.. ఎలాంటి వ్యాధులు దరిచేరవు. కానీ, చాలావరకు ప్రజలు రోగనిరోధక వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. మరి రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని ఎలా తెలుసుకోవాలి? అంటే కొన్ని లక్షణాలు మన శరీరంలో కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ లక్షణాలేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

నిరంతర ఫ్లూ, జలుబు..

బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉంటే.. జలుబు, ఫ్లూ వంటి సమస్యలు నిరంతరం తలెత్తుతాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే.. ప్రమాదకరమైన వైరస్‌లు, బాక్టీరియాలు దాడి చేస్తాయి. దీని కారణంగా ఫ్లూ, జలుబు తరచుగా వస్తుంది. అయితే, సంవత్సరానికి 2, 3 సార్లు జలుబు చేయడం సర్వసాధారణం.

ఇవి కూడా చదవండి

ఉదర సంబంధిత సమస్యలు..

రోగనిరోధక వ్యవస్థకు, మన జీవర్ణవ్యవస్థతో సంబంధం ఉంది. అతిసారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే, అందుకు కారణం.. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ. అయితే, ఉదర సంబంధిత సమస్యలు తలెత్తితే ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నీరసంగా ఉండటం..

శరీరంలో నీరసంగా అనిపించడం కూడా బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతం. శరీరం ఎల్లప్పుడూ వ్యాధికారక క్రిములతో పోరాడుతూ ఉంటుంది. కావున శక్తి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ప్రతీసారి అలసటగా, నీరసంగా ఉంటారు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా అలసటతో పాటు నీరసంగా అనిపించవచ్చు.

గాయం త్వరగా తగ్గకపోవడం..

శరీరంలో ఏదైనా గాయం అయితే, అది త్వరగా తగ్గకపోవడం కూడా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు సంకేతం. శరీరంలో ఇమ్యూనిటీ సరిగా లేకపోతే.. గాయం త్వరగా నయం అవదు. రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే.. గాయం అంత త్వరగా మానుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..