Custard apple Benefits: సీతాఫలాన్ని పోషకాల ఘని అని ఎందుకంటారు.. డయాబెటిస్ ఉన్న వారు తినొచ్చా?

Custard apple Benefits: ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రకరకాల వైరస్‌ను వెంటాడుతున్నాయి. అలాగే జీవన శైలిలో కూడా మార్పులు..

Custard apple Benefits: సీతాఫలాన్ని పోషకాల ఘని అని ఎందుకంటారు.. డయాబెటిస్ ఉన్న వారు తినొచ్చా?
Custard Apple
Follow us
Subhash Goud

|

Updated on: Sep 24, 2022 | 5:50 PM

Custard apple Benefits: ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రకరకాల వైరస్‌ను వెంటాడుతున్నాయి. అలాగే జీవన శైలిలో కూడా మార్పులు చేసుకోవడం ఎంతో ముఖ్యం. సమయానికి తినకపోవడం, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు. అలాగే మనం పీల్చే గాలి వల్ల కూడా రకరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఇక ప్రతి సీజన్‌లో దొరికి పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ప్రతి రోజు పండ్లను తినడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. వీటి వల్ల వివిధ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. కొన్ని పండ్లు ఏడాది పొడవునా లభిస్తుంటే.. మరి కొన్ని పండ్లు సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. అలాంటి పండ్లను మాత్రం వదిలిపెట్టకుండా తింటే ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు.

ఈ వర్షాకాలంలో వినాయక చవితి నుండి విరివిగా లభించేవి సీతాఫలం. ఈ పండ్లలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల ఘని అంటారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి. సీతాఫలం అల్సర్లను నయం చేయడంలోనూ, అసిడిటీని నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

కంటి చూపును మెరుగు పరుస్తుంది

ఇవి కూడా చదవండి

ఈ పండ్లు కంటి చూపును మరింతగా మెరుగు పరుస్తాయి. జుట్టుని, మెదడు పనితీరు మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అయితే డయాబెటిస్‌ వారు కూడా తినొచ్చట. కానీ మితంగా తినాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

Custard Apple

సీతాఫలంలో ఫైబర్‌..

సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధంగా ఉంటుంది. కాకపొతే, ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక క్యాలరీలు కలిగిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడేమో కానీ మళ్లీ అధిక బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇక ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?