TATA Nexon: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు టాటా నెక్సాన్‌ గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన కార్ల ధరలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ వాహనాలు వస్తున్నాయి. ఇక టాటా మోటార్స్‌ తమ నెక్సాన్‌ ఎలక్ట్రిక్‌ కార్లను మార్కెట్లోకి రీపొజిషన్‌ చేస్తున్నట్లు తెలిపింది. అయితే నెక్సాన్‌కు పోటీగా..

TATA Nexon: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు టాటా నెక్సాన్‌ గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన కార్ల ధరలు
Tata Nexon
Follow us
Subhash Goud

|

Updated on: Jan 19, 2023 | 11:32 AM

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ వాహనాలు వస్తున్నాయి. ఇక టాటా మోటార్స్‌ తమ నెక్సాన్‌ ఎలక్ట్రిక్‌ కార్లను మార్కెట్లోకి రీపొజిషన్‌ చేస్తున్నట్లు తెలిపింది. అయితే నెక్సాన్‌కు పోటీగా ఇతర కంపెనీలు ఎలక్ట్రిక్‌ కార్లను తీసుకువస్తున్నాయి. ఈ పోటీని ఎదుర్కొనేందుకు నెక్సాన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల ధరల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. నెక్సాన్‌ ఈవీ కార్ల ధరలు ఇప్పుడు రూ.14.49 లక్షల నుంచి ప్రారంభమైంది. నెక్సాన్‌ ఈవీ ప్రైమ్‌ ధరల శ్రేణి రూ.14.49- 16.99 లక్షల (ఎక్స్‌-షోరూం) మధ్య ఉంది. అంతకుముందు వీటి ప్రారంభ ధర రూ.14.99 లక్షలుగా ఉండేది. ఎలక్ట్రిక్‌ మ్యాక్స్‌లో కంపెనీ కొత్త ట్రిమ్‌లను తీసుకొచ్చింది. ధరల విషయంలో రూ. 16.49 లక్షలు నుంచి రూ. 18.99 లక్షలుగా ఉంది. మ్యాక్స్‌ వేరియంట్లలో మైలేజీ 437 కి.మీ నుంచి 453 కి.మీకు పెంచే యోచనలో ఉన్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. కొత్త ఎలక్ట్రిక్‌ మ్యాక్స్‌లను కొనుగోలు చేసేవారికి 2023 ఫిబ్రవరి 15 నుంచి డీలర్‌షిప్‌లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మైలేజీ రేంజ్‌ పెరుగుతుందని కంపెనీ చెబుతోంది.

బుకింగ్స్‌ ప్రారంభం

నెక్సాన్‌ ఎలక్ట్రికల్‌ వాహనాలలోని అన్ని ట్రిమ్‌లకు ప్రస్తుతం బుకింగ్‌లు ప్రారంభమైనట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్‌ మ్యాక్స్‌ ఎక్స్‌ఎం వేరియంట్‌ డెలివరీలు 2023 ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇటీవలే ఎక్స్‌యూవీ 400ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 15.99 లక్షలు. ఈ ధరల విభాగంలో మరిన్ని కంపెనీలు కూడా ఈ ఏడాది కార్లను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాటా మోటార్స్‌ తమ నెక్సాన్‌ లైనప్‌లో మార్పులు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి