AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Gadkari: కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం.. లారీ డ్రైవర్ల కోసం కొత్త చట్టం

వాహనదారులకు కొత్త కొత్త నిబంధనలను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా టోల్‌టాక్స్‌ విషయంలో కీలక మార్పులు చేస్తోంది. టోల్‌గేట్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు పడకుండా సేవలను..

Nitin Gadkari: కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం.. లారీ డ్రైవర్ల కోసం కొత్త చట్టం
Nitin Gadkari
Subhash Goud
|

Updated on: Jan 19, 2023 | 11:09 AM

Share

వాహనదారులకు కొత్త కొత్త నిబంధనలను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా టోల్‌టాక్స్‌ విషయంలో కీలక మార్పులు చేస్తోంది. టోల్‌గేట్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు పడకుండా సేవలను మరింతగా సులభతరం చేస్తోంది. అలాగే రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఎన్నో చర్యలు చేపడుతోంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు. టోల్ టాక్స్ రూల్స్‌లో రిలీఫ్ ఇచ్చిన కేంద్ర మంత్రి ఇప్పుడు ట్రక్ డ్రైవర్ల కోసం కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు. దీని ద్వారా ప్రభుత్వం ట్రక్ డ్రైవర్ల పని వేళలను మార్చే అవకాశం ఉంది. తద్వారా ఎవరూ ఎక్కువ పని చేయకూడదు. దీనితో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కూడా అదుపులో ఉంటాయని కేంద్రం భావిస్తోంది.

2025 సంవత్సరం ముగిసేలోపు రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని కారణంగా ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తోందని మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ‘సడక్ సురక్షా అభియాన్’ అనే ప్రజాప్రస్థాన ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని, రోడ్డు భద్రత – ఇంజనీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు

పని వేళలను నిర్ణయిస్తాం

బుధవారం విడుదల చేసిన ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. లారీ డ్రైవర్లకు పని గంటలను నిర్ణయించేలా చట్టం తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం, మంత్రిత్వ శాఖ ‘అందరికీ సురక్షితమైన రోడ్లు’ ప్రచారం కింద జనవరి 11 నుండి 17 వరకు రోడ్ సేఫ్టీ వీక్‌ను పాటిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి