AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త.. లేకపోతే తీవ్రంగా మోసపోవాల్సిందే!

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు డిమాండ్ పెరిగిపోయింది. షాపుల్లో కన్నా ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా షాపింగ్‌లు చేస్తున్నారు. ఈ-కామర్స్‌ దిగ్గజాలు కూడా కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు రకరకాల..

Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త.. లేకపోతే తీవ్రంగా మోసపోవాల్సిందే!
Online Shopping
Subhash Goud
|

Updated on: Jan 19, 2023 | 10:26 AM

Share

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు డిమాండ్ పెరిగిపోయింది. షాపుల్లో కన్నా ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా షాపింగ్‌లు చేస్తున్నారు. ఈ-కామర్స్‌ దిగ్గజాలు కూడా కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు పెడుతుంటాయి. పండగ రోజుల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా డిస్కౌంట్‌ ఆఫర్లు ఇస్తుంటాయి. దీంతో ఇంట్లోనే ఉండి స్మార్ట్‌ఫోన్‌లో తమకు నచ్చిన వస్తువులను ఆర్డర్‌ చేసేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలని, లేకపోతే మోసానికి గురయ్యే ప్రమాదం ఉందని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఆన్‌లైన్ లావాదేవీలు జరిపే విషయాలలో కూడా కొన్ని సార్లు మోసపోతున్న ఘటనలు చూస్తున్నాం. కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటించడం ద్వారా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆన్‌లైన్ లావాదేవీలు సురక్షితంగా చేయవచ్చు. ఎక్కువ మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌పై ఆధారపడుతుండటంతో మోసగాళ్లు కూడా ఆన్‌లైన్‌ సైట్‌ల ద్వారా మోసం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడం, అనేక ఇతర పద్ధతులను ఉపయోగించి వినియోగదారుల ఖాతాలను హ్యాక్‌ చేస్తున్నారు. అయితే మోసాలకు భయపడి ఆన్‌ లైన్‌ షాపింగ్‌ను ఆపేస్తే.. మనకు ఎంతో సమయం వృధా అవుతుంది. అందుకే ముందస్తు జాగ్రత్తలను పాటించడం ద్వారా ఆన్‌ లైన్‌ లావాదేవీల్లో మోసాలకు అడ్డుకట్టవేసే అవకాశం ఉంటుంది.

పాస్‌వర్డ్‌ ఉపయోగించకుండా..

పాస్‌వర్డ్‌లను ఉపయోగించకుండా బయోమెట్రిక్ లాగిన్‌ ఆధారంగా షాపింగ్ చేయడం మంచిదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేయడం సులభం. పాస్‌వర్డ్‌లను తరచూ మార్చుకునే పనికి బదులు బయోమెట్రిక్‌లు, ఈసిగ్నేచర్‌ల ప్రయోజనాలను పొందవచ్చు. బ్యాంకులు కస్టమర్లకు రియల్ టైమ్ ప్రొటెక్షన్ అందించడంతోపాటు పాస్‌వర్డ్ ప్రామాణీకరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సైబర్ సెక్కూరిటీ నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రిమోట్ యాక్సెస్‌ను యాక్సెప్ట్ చేయ్యొద్దు

ఎవరికైనా రిమోట్ యాక్సెస్ ఇచ్చినట్లయితే, వారు మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్ అన్ని కదలికలను గమనిస్తారు. మీకు తెలియకుండానే, మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ అన్నీ వేరే వాళ్లకు సులభంగా తెలిసే అవకాశం ఉంది. మోసగాళ్లు మీ ఫోన్‌ని బ్లాక్ చేసి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీన్ని నివారించడానికి తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు.

ఓటీపీ విషయంలో జాగ్రత్త..

ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో వచ్చిన ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దు. మోసగాళ్లు అనేక తప్పుడు మాటలు చెప్పి కస్టమర్‌ని నమ్మించేలా చేయడం ద్వారా ఓటీపీని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు, పిన్, ఓటీపీ ఏ కారణం చేతనైనా ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది.

పబ్లిక్, ఉచిత వైఫైని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్త..

పబ్లిక్ ప్లేస్‌లలో, ఉచిత వైఫైకి ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్ కనెక్ట్ చేయడం అంత మంచిది కాదు. ఇలాంటి వైఫైలు రహస్య సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ లావాదేవీల కోసం మీ ఫోన్‌లో లేదా ఇంట్లోని డేటా కనెక్షన్ డేటాను ఉపయోగించడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి