E-Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల రయ్.. రయ్.. రూ. లక్షలోపు లభించే ఈ స్కూటర్ యమా అదుర్స్!

హాప్ ఎలక్ట్రిక్.. ద్విచక్ర వాహనాలను తయారు చేసే ఈ సంస్థ.. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హై-స్పీడ్ వేరియంట్‌ను విడుదల చేసింది.

E-Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల రయ్.. రయ్.. రూ. లక్షలోపు లభించే ఈ స్కూటర్ యమా అదుర్స్!
Electric Scotter
Follow us

|

Updated on: Jan 19, 2023 | 12:36 PM

హాప్ ఎలక్ట్రిక్.. ద్విచక్ర వాహనాలను తయారు చేసే ఈ సంస్థ.. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హై-స్పీడ్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ అతి తక్కువ ధరలో లభించడమే కాదు.. మంచి మైలేజ్ అందిస్తోంది. మరి దాని ధర, ఫీచర్లు, ఎంత మైలేజ్ ఇస్తోందన్న వివరాల గురించి తెలుసుకుందామా..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 97 వేలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు, మీరు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే, ఇది దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ తన కస్టమర్ల కోసం ఈ స్కూటర్‌ను ఐదు వేర్వేరు రంగులలో అందుబాటులో ఉంచింది. 2.2kW(2.9 bhp) BLDC హబ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉన్న ఈ స్కూటర్, 90Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాఫీ, సులభమైన ప్రయాణం కోసం ఈ స్కూటర్‌లో అమర్చిన మోటార్ సిన్యుసోయిడల్ FOC వెక్టర్ కంట్రోలర్‌ను ఉపయోగిస్తుంది. అలాగే ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.1kWh లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చబడి ఉంది. 850W స్మార్ట్ ఛార్జర్ సాయంతో ఈ స్కూటర్‌ను కేవలం 2.5 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చుని కంపెనీ స్పష్టం చేసింది.

అటు ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 120 కిలోమీటర్లు డ్రైవింగ్ చేయవచ్చు. అంటే రూ. 1కి 5 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పవర్, ఎకో, రివర్స్, స్పోర్ట్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లను ఈ స్కూటర్‌లో పొందుతారు. స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. కాగా, ఈ మోడల్‌కు కాంబి బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇవ్వబడింది.