Auto expo: తప్పిన పెను ప్రమాదం.. అత్యంత ఖరీదైన టయోటా కారుపై వ్యాపించిన మంటలు.. వైరల్ వీడియో..
ఇంటర్నెట్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే.. ఆటో ఎక్స్‌పో 2023 జరుగుతున్న ప్రాంగణంలో ని టయోటా పెవిలియన్ వద్ద టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 కారు ఉంచిన ప్రాంతం పైన చిన్న మంటను చూపిస్తుంది.
ఆటో ఎక్స్ పో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమోటి వ్ దిగ్గజాలు తమ ఉత్పత్తులను భారత దేశంలో ఆవిష్కరించేందుకు అనువైన మార్గం. అందుకే తయారీ దారులు ఈ షోకు క్యూ కడతారు. ఈ ఏడాది గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న షోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన వాహన తయారీదారులు తమ అత్యుత్తమ వాహనాలను ప్రదర్శిస్తున్నారు. దీనిని ప్రతి రోజూ వేలాది మంది సందర్శకులు వీక్షిస్తున్నారు. అయితే అటువంటి ప్రాంతంలో ఓ పెను ప్రమాదం తప్పింది. స్థానిక ఎగ్జిబిటర్ సత్వరమే స్పందించడంతో ఎటువంటి నష్టం వాటిల్లలేదు.
ఇంతకీ ప్రమాదం ఏంటంటే..
ఇంటర్నెట్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే.. ఆటో ఎక్స్‌పో 2023 జరుగుతున్న ప్రాంగణంలో ని టయోటా పెవిలియన్ వద్ద టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 కారు ఉంచిన ప్రాంతం పైన చిన్న మంటను చూపిస్తుంది. గ్రాండ్ షో ప్రారంభమైన రెండో రోజు అంటే జనవరి 12న ఈ సంఘటన జరిగింది.
వీడియోలో ఏముందంటే..
భారతదేశంలోని టయోటా అత్యంత ఖరీదైన కారు పైన మంటలు మొదట చిన్నవిగా కనిపించాయి. అయితే పెవిలియన్ వద్ద ఉన్న గార్డులలో ఒకరు దానిని ఆర్పేలోపు అది నెమ్మదిగా వ్యాపించింది. సంఘటన సమయంలో, టయోటా పెవిలియన్ వద్ద చాలా మంది సందర్శకులు ఉన్నారు. వారిలో కొందరు తమ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ మంటలను రికార్డ్ చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే స్థానిక సిబ్బంది అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వైరల్ అయిన వీడియోను కింద లింక్ లో చూడొచ్చు.
GREATER NOIDA ऑटो एक्सपो के हाल नंबर 9 में शॉर्ट सर्किट से लगी आग, टोयोटा के पवेलियन में लगी आग, बड़ा हादसा होने से टला, हादसे के वक्त बड़ी संख्या में थे लोग मौजूद VIDEO GOES VIRAL!
PS KNOWLEDGE PARK @noidapolice @CP_Noida @cfonoida pic.twitter.com/zCn3DoSXd9
— हिमांशु शुक्ला (@himanshu_kanpur) January 14, 2023
కొనసాగుతున్న షో..
ఆటో ఎక్స్‌పో 2023 కొనసాగుతోంది. జనవరి 18న ఇది ముగుస్తుంది. దీనిలోకి సందర్శకులు వెళ్లాలి అంటే ముందుగా టికెట్ తీసుకోవాలి. టికెట్లను బుక్‌మై షో లేదా గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్ వెలుపల ఉన్న టికెట్ కౌంటర్ల వద్ద పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..