Delhi: ఉలిక్కిపడిన ఢిల్లీ.. మూడు ముక్కలైన డెడ్‌బాడీ లభ్యం.. ఉగ్ర కుట్రలో ఇద్దరు అరెస్ట్..

ఢిల్లీలో అరెస్టయిన ఇద్దరు ఉగ్రవాదులను విచారిస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి. వాళ్లిచ్చిన సమాచారం మూడు ముక్కలైన డెడ్‌బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Delhi: ఉలిక్కిపడిన ఢిల్లీ.. మూడు ముక్కలైన డెడ్‌బాడీ లభ్యం.. ఉగ్ర కుట్రలో ఇద్దరు అరెస్ట్..
Delhi Police
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 14, 2023 | 9:25 PM

దేశరాజధాని ఢిల్లీలో టెర్రర్‌ స్కెచ్‌ అలజడి రేపుతోంది. రిపబ్లిక్‌డే వేడుకల వేళ ఢిల్లీలో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపు లోకి తీసుకున్నారు. జ‌గ్‌జిత్ సింగ్‌, నౌషాద్‌ ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలోని బల్స్వా డైరీ ప్రాంతంలో మూడు ముక్కలైన డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. అయితే, శవం ఎవరిదన్న విషయంపై సస్సెన్స్‌ నెలకొంది. విదేశాల నుంచి వచ్చిన ఆర్డర్‌తో వాళ్లిద్దరు ఈ హత్య చేసినట్టు పొలీసులు వెల్లడించారు. ఈ హత్యకు ఆర్డర్‌ ఇచ్చింది ఎవరు..? వాళ్లు ఎక్కడ ఉన్నారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జగ్‌జీత్‌సింగ్‌ సింగ్‌ అలియాస్‌ జగ్గాకు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. 56 ఏళ్ల నౌషాద్‌కు కశ్మీర్‌కు చెందిన హర్కత్‌ ఉల్‌ అన్సర్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి. జగ్‌జీత్‌సింగ్‌పై గతంలో కూడా కేసులు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో మర్డర్‌ కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. జైలు నుంచి పరారైన జగ్గా ఢిల్లీలో చాలా కాలం నుంచి తలదాచుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

రెండు హ్యాండ్‌ గ్రనేడ్లతో పాటు మూడు పిస్టల్స్‌ స్వాధీనం

ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో జగ్‌జీత్‌సింగ్‌, నౌషాద్‌ ఉన్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. రెండు హ్యాండ్‌ గ్రనేడ్లతో పాటు మూడు పిస్టల్స్‌ , 22 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరికి కోర్టు 14 రోజు పోలీసు రిమాండ్‌ విధించింది. గణతంత్ర దినోత్సవ వేళ ఢిల్లీలో హైఅలర్ట్‌ ఉంది. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న పోలీసులకు ఈ ఇద్దరు చిక్కారు.

రిపబ్లిక్‌డే వేళ ఖలిస్తాన్‌ , కశ్మీర్‌ ఉగ్రవాదులు కలిసి ఢిల్లీలో ఏదైనా కుట్రకు ప్లాన్‌ చేశారా ? అరెస్టయిన జగ్‌జీత్‌సింగ్‌, నౌషాద్‌కు ఈ కుట్రలో భాగస్వామ్యం ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న ఈ ఇద్దరు ఉగ్రవాదులకు విదేశాల నుంచి ఆర్డర్‌ రావడం, ఒకరిని దారుణంగా హత్య చేయడం తీవ్ర సంచలనం రేపింది. గణతంత్రదినోత్సవ వేళ ఈ ఉగ్రవాదులు పన్నిన కుట్రను తేల్చే పనిలో ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ నిమగ్నమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..