Police: ఏఎస్‌ఐ ఇంట్లో భారీ చోరీ.. దొంగల ఆచూకీ కోసం బాబా సాయం కోరిన పోలీసు అధికారి.వీడియో వైరల్.
సామాన్యంగా ఎవరింట్లోనైనా, లేదా ఏ సంస్థలోనైనా చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ ఆ పోలీసుల ఇంట్లోనే చోరీ జరిగితే... వాళ్లెవరిని ఆశ్రయించాలి.. వీళ్లకీ రక్షకులు ఉన్నారండోయ్..
సామాన్యంగా ఎవరింట్లోనైనా, లేదా ఏ సంస్థలోనైనా చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ ఆ పోలీసుల ఇంట్లోనే చోరీ జరిగితే… వాళ్లెవరిని ఆశ్రయించాలి.. వీళ్లకీ రక్షకులు ఉన్నారండోయ్.. వారే బాబాలు. మనదేశంలో బాబాలకు కొదవేముంది చెప్పండి? తాజాగా ఓ పోలీసు అధికారి తన ఇంట్లో చోరీ జరిగితే దొంగలను పట్టుకుని చీల్చి చెండాల్సిన ఆయన వారిని పట్టుకునేందుకు సాయం చేయాలంటూ ఓ బాబాను ఆశ్రయించారు. బాబా కాళ్ల వద్ద కూర్చుని మాట్లాడుతున్న పోలీసు అధికారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన హర్యానాలోని పానిపట్ జిల్లాలో జరిగింది. డిసెంబరు 23న జరిగిన ఈ ఘటనలో చాందినీబాగ్ పోలీస్ క్వార్టర్స్‌లోని ఏఎస్సై కృష్ణకుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. 40 తులాల బంగారం, మూడున్నర లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. దాంతో ఈ ఏఎస్‌ఐ తాను పనిచేస్తున్న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దొంగల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. లాభం లేదనుకున్న ఆయన దొంగలను పట్టుకునేందుకు సాయం చేయాలంటూ పండోఖర్ బాబా ఆశ్రమానికి వెళ్లారు. తన ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆయనకు వివరించి, దొంగలను పట్టుకోవడంలో సాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన బాబా.. ఆయన ఈ పోలీసు అధికారికి మంచి క్లూ అయితే ఇచ్చారు కానీ… గ్యారంటీ మాత్రం ఇవ్వలేదు. ఇంతకీ బాబా ఏం చెప్పారంటే.. క్లూ మీ పోలీస్ క్వార్టర్స్‌లోనే ఉందీ.. పంజాబ్ సరిహద్దులకు వెళ్తే దొంగలు దొరుకుతారని చెప్పి, చివరిలో గ్యారెంటీ లేదని చెప్పారు. అదండీ సంగతి..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

