Cold Wave: నార్త్ ఇండియాలో చంపేస్తున్న చలిపులి.. మంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్రాలు..
ఉత్తరభారతంలో చలిపులి మరింత విజృంభిస్తోంది. జమ్ముకశ్మీర్ , హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో ప్రజలు వణికిపోతున్నారు.
ఉత్తరభారతంలో చలిపులి మరింత విజృంభిస్తోంది. జమ్ముకశ్మీర్ , హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో ప్రజలు వణికిపోతున్నారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో మంచు పేరుకుపోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దోడా, సోన్‌మార్గ్ , కుప్వారా తదితర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. చలి చంపేస్తున్నప్పటికీ.. సిమ్లా , మనాలి లాంటి హిల్‌స్టేషన్లలో టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. ఢిల్లీలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఢిల్లీలోతోపాటు.. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు కూడా చలితో ఇబ్బందులు పడుతున్నారు.
జమ్ము-శ్రీనగర్ హైవే పూర్తిగా మంచుతో నిండిపోయింది. దీంతో వాహనాల రాకపోలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. మంచును తొలగించడానికి అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రంలో హెలీకాప్టర్, బ్యాటరీ కార్ సేవలు నిలిచిపోయాయి.
ఉత్తరాఖండ్‌లో చాలా చోట్ల ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. ఛార్‌ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఎటు చూసినా మంచు లోకమే కన్పిస్తోంది. గంగోత్రి పూర్తిగా మంచుతో నిండిపోయింది. గంగానది గడ్డకట్టిపోయింది. ఉత్తరాఖండ్‌లో చాలా చోట్ల మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కేదార్‌నాథ్ క్షేత్రంలో కూడా హిమపాతం ఉక్కిరి బిక్కరి చేస్తోంది.
#WATCH | Uttarakhand: Auli in Chamoli district covered under a white sheet of snow as it receives fresh snowfall pic.twitter.com/TvV4Ufu1Lf
— ANI (@ANI) January 14, 2023
కేదార్‌నాథ్ , చమేలి తదితర ప్రాంతాల్లో కూడా భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా పర్వత ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సం శీతల గాలుల తీవ్రత పెరగడంతో ఉత్తరాది చలితో వణుకుతోంది. అటు హిమాలయ ప్రాంతాలు మంచుతో తడిసి ముద్దవడమే కాకుండా కప్పబడిపోతున్నాయి.
View of Snow fall #Kashmir #WINTER ❄⛄ pic.twitter.com/UQFnpa7Yax
— ★ Bisma★ (@iamBismahh) January 14, 2023
బద్రీనాథ్‌ను మంచు ముంచేసింది. చమోలీ, జోషిమఠ్ ప్రాంతాల్లో మంచులో కూరుకుపోతున్నాయి. నివాస ప్రాంతాలు, చెట్లు, ఇళ్లు, రోడ్లు మంచుతో మూసుకుపోతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా పర్వత శ్రేణుల్లో మంచు ఏకధాటిగా కురుస్తోంది. మంచు కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్యాటకులు సైతం ఇబ్బందులు ఎదురౌతున్నా..మంచుని ఎంజాయ్ చేస్తున్నారు.
#WATCH | CRPF troops posted in the Shopian district enjoying a game of Volleyball on the freshly spread white layer of snow
(Video source: CRPF) pic.twitter.com/L2jIYVBxH6
— ANI (@ANI) January 14, 2023
హిమాచల్ ప్రదేశ్‌లో కూడా హిమపాతం వణికిస్తోంది. సిమ్లాలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఏకంగా 210 రోడ్లు మంచుతో మూసుకుపోయాయి. నేషనల్ హైవే క్లోజ్ అయింది. ఉత్తర భారత ప్రాంతాలు తీవ్రమైన శీతల ప్రభావానికి గురికానున్నాయని అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
#WATCH | J&K: Snow clearing operations being undertaken at Srinagar Airport.
(Video: Srinagar Airport’s Twitter handle) pic.twitter.com/FETyrh1g9a
— ANI (@ANI) January 14, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..