Honda Sports Bike: హొండా నుంచి మరో స్పోర్ట్స్ బైక్.. ఫ్లైక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో.. లుక్ మామూలుగా లేదుగా..

అయితే హోండా కంపెనీ ఈ షో పై పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరి క్షణంలో తన అత్యాధునిక, అంతర్జాతీయ స్థాయి ద్విచక్ర వాహనాన్ని ప్రదర్శించి, ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్లో రూపొందిన ఈ బైక్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

Honda Sports Bike: హొండా నుంచి మరో స్పోర్ట్స్ బైక్.. ఫ్లైక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో.. లుక్ మామూలుగా లేదుగా..
Honda XRE 300
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 18, 2023 | 6:23 PM

ఆటో ఎక్స్ పో 2023, అన్ని దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలకు మంచి వేదికైంది. ఇక్కడి మార్కెట్ లో తమ ముద్ర వేసేందుకు తమ తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. అయితే హోండా కంపెనీ ఈ షో పై పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరి క్షణంలో తన అత్యాధునిక, అంతర్జాతీయ స్థాయి ద్విచక్ర వాహనాన్ని ప్రదర్శించి, ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్లో రూపొందిన ఈ బైక్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

హోండా ఎక్స్ఆర్ఈ 300( Honda XRE 300)..

బ్రెజిల్ సాంకేతికతతో కూడిన సింగిల్ సిలెండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగిన హోండా ఎక్స్ఆర్ఈ 300 బైక్ ను ఆ కంపెనీ ఆటో ఎక్స్ పో 2023 పెవిలియన్ లో ప్రదర్శించింది. ఇది 29.66 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో గ్యాసోలిన్, ఇథనాల్ రెండింటితోనూ నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్. ఇది గ్యాసోలిన్ తో నడిచేటప్పుడు 7500 ఆర్పీఎం వద్ద 25.4 హెచ్ పీ పవర్, 27.6 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇథనాల్ తో నడిచేటప్పుడు 7500 ఆర్పీఎం వద్ద 25.6 హెచ్ పీ పవర్, 28 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇది ఆరు గేర్ల వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ వేరియంట్ దాదాపు ఐదు గేర్ల వ్యవస్థతో కూడి రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ మోడల్ ను పోలి ఉంటుంది. దీనికి పోటీగానే హోండా కంపెనీ ఈ ఎక్స్ఆర్ఈ 300 ని లాంచ్ చేసింది.

స్పెసిఫికేషన్లు.. ఫీచర్లు..

ఈ కేటగిరీకి చెందిన బైక్ సాధారణంగా 19 అంగుళాల, 17 అంగుళాల వెడల్పు కలిగిన అల్లాయ్ వీల్స్ తో వస్తాయి. కానీ హోండా ఎక్స్ఆర్ఈ 300 బైక్ మాత్రం 21 అంగళాల వీల్స్ తో వస్తుంది. సీట్ హైట్ 860 ఎంఎం ఉంటుంది. ఇది కేటీఎం 390 కన్నా ఎక్కువ. ఫ్రంట్, బ్యాక్ రెండువైపులా డిస్క్ బ్రేకులు ఉంటాయి. దీనిలో ఎల్ సీడీ డిస్ ప్లే ఉంటుంది. అలాగే బండి ముందు వెనుక ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. యాంటీ లాక్ బ్రేక్స్( ఏబీఎస్)ను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

టెస్టింగ్ పూర్తి..

మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ బండికి మన దేశంలో టెస్టింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. వీలైనంత వేగంగానే మన మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు అంచనా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..