Tata Magic EV: ఎలక్ట్రిక్‌ వేరియంట్లో టాటా మ్యాజిక్‌.. ఒకేసారి పదిమందితో కలిసి ప్రయాణం.. ఫీచర్లు ఇవే..

టాటా కంపెనీ కూడా 2045 నాటికి జీరో ఎమిషన్‌ స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తన ఉత్పత్తులను ఎలక్ట్రిక్‌ వేరియంట్లలో విడుదల చేస్తోంది. దీనిలో భాగంగా అత్యంత ప్రజాదరణ పొందిన మ్యాజిక్‌ ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ ను కంపెనీ ఆవిష్కరించింది.

Tata Magic EV: ఎలక్ట్రిక్‌ వేరియంట్లో టాటా మ్యాజిక్‌.. ఒకేసారి పదిమందితో కలిసి ప్రయాణం.. ఫీచర్లు ఇవే..
Tata Magic EV
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 19, 2023 | 7:39 PM

టాటా మేజిక్‌.. భారతీయ మార్కెట్ల్లో ఒక సంచలనమే.. చిన్న తరహా ప్రయాణ సాధనంగా బాగా ప్రాచుర్యం పొందింది. కారు రెంట్‌ ను భరించలేని వారు ఈ వాహనం సాయంతో దూర ‍ప్రయాణాలు కుటుంబాలుగా వెళ్లడానికి బాగా ఉపయోగపడుతోంది. అయితే ప్రస్తుత మార్కెట్‌ అంతా పర్యావరణ హిత వాహనాలనే ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో టాటా కంపెనీ కూడా 2045 నాటికి జీరో ఎమిషన్‌ స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తన ఉత్పత్తులను ఎలక్ట్రిక్‌ వేరియంట్లలో విడుదల చేస్తోంది. దీనిలో భాగంగా అత్యంత ప్రజాదరణ పొందిన మ్యాజిక్‌ ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ ను కంపెనీ ఆవిష్కరించింది. ఆటో ఎక్స్‌పో 2023లో ఈ కొత్త మ్యాజిక్‌ ఈవీని ప్రదర్శించింది. దీని పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..

టాటా ఏస్‌(Ace) మోడల్‌ లోనే..

టాటా ఏస్‌ మోడల్‌ ను ఎలక్ట్రిక్‌ వేరియంట్లో గతేడాది ఆ కంపెనీ లాంచ్‌ చేసింది. దీని ఆధారంగానే ఇప్పడు మ్యాజిక్‌ వాహనాన్ని ఈవీగా ఆధునికీకరించింది. ఇది డ్రైవర్ + 10 సీటర్ ప్యాసింజర్ వాహనం. దీనిని పాఠశాల విద్యార్థులకు, స్టేజ్‌ క్యారేజ్‌, అంబులెన్స్‌ సేవలు వంటి వాటి కోసం రూపొందించింది. ఈ వాహనం 3,790mm పొడవు, 1,500mm వెడల్పును కలిగి ఉంది. అలాగే 2,100mm పొడవైన వీల్‌బేస్‌ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 160mm వద్ద ఉంది. జీరో ఎమిషన్ మొబిలిటీ కోసం బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తూ, టాటా మ్యాజిక్ ఎలక్ట్రిక్ 10 సీటర్ EV అధునాతన బ్యాటరీ కూలింగ్ సిస్టమ్‌ తో వస్తోంది. IP 67 రేటెడ్ వాటర్, డస్ట్ ప్రూఫ్ డ్రైవింగ్ భాగాలను కలిగి ఉంటుంది.

బ్యాటరీ ప్యాక్‌ ఇలా..

మ్యాజిక్‌ ఈవీలో 14kWh నుంచి 20 kWh వరకూ బ్యాటరీ సామర్థ్యాలను అందిస్తుంది. ఇవి 90Nm నుంచి 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలవు. దీనిలో సింగిల్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ ఉంది. ముందు, వెనుక భాగంలో సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ సిస్టమ్‌ ఉంటుంది. ఈ బ్యాటరీ స్లో, ఫాస్ట్, హోమ్ చార్జింగ్ సదుపాయంతో వస్తుంది. ఇంటి దగ్గర చార్జింగ్‌ పెడితే బ్యాటరీ ఫుల్‌ చార్జ్‌ అవడానికిఆరు నుంచి ఆరున్నర గంటలు పడుతుంది. అదే ఫాస్ట్ చార్జింగ్ అఇయతే 1.1 నుంచి 1.7 గంటల్లో బ్యాటరీ ఫుల్‌ చార్జ్‌ అవుతుంది. ఒక సారి బ్యాటరీ ఫుల్‌ చార్జ్‌ అయితే దాదాపు 140 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫీచర్లు ఇలా..

బోర్డ్ ఫీచర్లలో 7 అంగుళాల TFT ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ రివర్స్ కెమెరా ఉన్నాయి. క్యాబిన్ అదనపు సామాను కోసం తగినంత విశాలంగా ఉంటుంది. ఈ ఏడాది చివరిలో వినియోగదారులకు అందుబాటులో వచ్చే ఈ వాహనం ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..