Electric Bike: మార్కెట్లోకి మరో సూపర్ ఎలక్ట్రిక్ బైక్.. కేవలం 150 బైక్‌లు మాత్రమే అమ్మకం.. ఫీచర్స్ అదుర్స్
ఈ క్రమంలో జ్యూస్ డ్ బైక్స్ తన అత్యాధునిక హైపర్ స్క్రాంబ్లర్ 2 ఎలక్ట్రిక్ బైక్ ను ఆవిష్కరించింది. ఇది గంటకు 35 మైళ్ల టాప్ స్పీడ్ ను అందుకుంటుందని కంపెనీ ప్రకటించింది. ఆకర్షణీయమైన లుక్ లో, అధిక పనితీరుతో ఆకట్టుకుంటోంది.

ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో వినూత్నమైన మోడళ్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. బైక్ లు, స్కూటర్లు, మోపెడ్లు ఇలా అనేక రకాల మోడళ్లు మార్కెట్ కు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో జ్యూస్ డ్ బైక్స్ తన అత్యాధునిక హైపర్ స్క్రాంబ్లర్ 2 ఎలక్ట్రిక్ బైక్ ను ఆవిష్కరించింది. ఇది గంటకు 35 మైళ్ల టాప్ స్పీడ్ ను అందుకుంటుందని కంపెనీ ప్రకటించింది. ఆకర్షణీయమైన లుక్ లో, అధిక పనితీరుతో ఆకట్టుకుంటోంది. ఈ బైక్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కేవలం 150 యూనిట్లు మాత్రమే..
హైపర్‌స్క్రాంబ్లర్ 2 ఇ-బైక్‌లు కేవలం 150 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయబడతాయని ఆ కంపెనీ ఫౌండర్ టోరా హారిస్ తెలిపారు. ప్రతి యూనిట్‌కు వరుసగా నంబర్‌లు ఉంటాయి. ఇది 2kW గరిష్ట అవుట్‌పుట్ సామర్థ్యంతో గంటకు 35 మైళ్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతుంది. 1kW రెట్రోబ్లేడ్ మోటారును కలిగి ఉంది.
మైలేజీ వివరాలు..
ఎడిషన్ హైపర్‌స్క్రాంబ్లర్ 2 పవర్ బ్యాటరీ సెటప్ పరిమిత పరిధిని అందిస్తుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 మైళ్ల పరిధిని అందిస్తుంది. దీనిలో 52V 19.2Ah సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీలను కలిగి ఉంది.
సేఫ్టీ ఫీచర్లు సూపర్..
ఈ బైక్ సౌకర్యవంతమైన ప్రయాణానికి హామీ ఇచ్చే కొన్ని భద్రతా ఫీచర్లతో వస్తోంది. దీని ముందు, వెనుక సస్పెన్షన్ పూర్తి ఎలక్ట్రిక్ మోపెడ్ శక్తిని ఇస్తుంది. దీని భారీ హెడ్‌లైట్ తీవ్రమైన పరిస్థితుల్లో కూడా మంచి ఫోకస్ ను అందిస్తుంది. దీనిలో బ్లూటూత్ స్పీకర్ ప్రయాణంలో ఉన్నప్పుడు మంచి సంగీతాన్ని అందిస్తుంది. ఇది టర్న్ సిగ్నల్స్‌తో సహా పూర్తి LED లైట్ సెటప్ ను కలిగి ఉంది. కస్టమ్ గ్రీన్ కలర్‌లో ఇది వస్తోంది. దీని 4-అంగుళాల టైర్లు కష్టతరమైన భూభాగాల్లో కూడా అనుకూలంగా ఉంటాయి. దీనిలో పవర్, స్పీడ్ అనే రెండు మోడ్లు ఉంటాయి.
ధర ఎంతంటే.. హైపర్‌స్క్రాంబ్లర్ 2 ఇ-బైక్ ధర $3,499 ఉంది. ఇవి జనవరి 19 నుండి ఆర్డర్‌లను ప్రారంభించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..