Union Budget 2023: ట్యాక్స్‌ మినహాయింపు పరిమితిని పెంచండి మేడమ్‌..!

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌లో కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌ సందర్భంగా కోటి ఆశలు నెలకొని ఉన్నాయి. కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్‌. ఎందుకంటే 2024లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి..

Union Budget 2023: ట్యాక్స్‌ మినహాయింపు పరిమితిని పెంచండి మేడమ్‌..!
Tax
Follow us
Subhash Goud

|

Updated on: Jan 20, 2023 | 4:00 AM

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌లో కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌ సందర్భంగా కోటి ఆశలు నెలకొని ఉన్నాయి. కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్‌. ఎందుకంటే 2024లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దీంతో ఈ బడ్జెట్‌లోనైనా తమ ఆశలు నెరవేరుతాయా? అని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రజల అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మంత్రి నిర్మలమ్మకు లేఖలు రాస్తున్నారు. నిర్మలా దీదీ,

శుభాకాంక్షలు!

నా పేరు రవీంద్ర. నేను తెలంగాణ లోని వరంగల్ నివాసిని. ఇక్కడ నేను ఒక మాల్‌లోని సూపర్ మార్కెట్ మేనేజర్‌ని. మాకు లంచ్ టైమ్ మధ్యాహ్నం 2 నుంచి 2:30 వరకు. ఈరోజు మంగళవారం. నేను ఉపవాసం ఉన్నాను. సమయం దొరికినందున బడ్జెట్‌కు ముందు మీకు నా అభిప్రాయం చెప్పాలని అనుకున్నాను. ఆర్థిక మంత్రిగారూ, ఈ లేఖ నిజాయితీ గల పన్ను చెల్లింపుదారుడి నుంచి వస్తోంది. నిజాయితీగా పన్ను చెల్లించేవారిని ప్రభుత్వం ఎప్పుడూ అభినందిస్తుంది. నేను నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నందుకు గర్వపడుతున్నాను. బడ్జెట్‌లో, పన్ను చెల్లింపుదారులను ప్రభుత్వం కూడా ప్రశంసించింది.

కానీ ఆర్థిక మంత్రి గారు, ఇప్పుడు అవసరం ఇంతకంటే ఎక్కువ. మీరు టీడీఎస్‌ అని పిలిచే పన్ను తీసివేసిన తర్వాత నాకు జీతం వస్తుంది. అంటే నేను కష్టపడి సంపాదించిన సంపాదన నా చేతికి రాకముందే నా ఆదాయపు పన్ను ప్రభుత్వానికి జమ అవుతుంది. ఇది కాకుండా నేను చేసే ప్రతి ఖర్చుపై జీఎస్టీ చెల్లిస్తాను. అది రేషన్, స్కూటర్ పెట్రోల్, మొబైల్ బిల్లు లేదా టీవీ రీఛార్జ్ ఏదైనా కావచ్చు. నా ఖర్చులలో ప్రతి భాగంపై ప్రభుత్వం పన్ను విధిస్తుంది. కడుపు మాడ్చుకుని రూపాయి రూపాయి పొదుపు చేస్తే దానిపై వచ్చే రాబడిపై కూడా నేను పన్ను చెల్లిస్తాను. బ్యాంకు డిపాజిట్‌లో లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే దానిపై కూడా పన్ను చెల్లించాల్సిందే. ఆర్థిక మంత్రి గారు, మాపై చాలా పన్నులు విధిస్తున్నారు. కానీ మేము చెల్లించడానికి వెనుకాడటం లేదు.

దేశంలోని సమర్థులైన పౌరులుగా ఇది మా బాధ్యత అని మేము అర్థం చేసుకున్నాము. కానీ ఒక ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు. నేను నా స్వంత పన్ను నుంచి తయారు అయిన వస్తువులను ఉపయోగించడానికి కూడా ఛార్జీలు కట్టాల్సి వస్తోంది. మేము కట్టిన టాక్స్ లతో రోడ్లు నిర్మిస్తారు. ఆ రోడ్ మీద వెళ్ళడానికి నేను టోల్ ఛార్జీలు చెల్లిస్తాను. ఇక ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల గురించి అయితే చెప్పక్కర్లేదు. వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదనేది అందరికీ తెలిసిన వాస్తవం. నేను ఒకవైపు పన్నులు కడుతూనే.. మరోవైపు రోడ్లపై టోల్ ఛార్జీలు.. ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం కోసం ఖర్చులు అలాగే పిల్లల కోసం స్కూల్ ఫీజులు కూడా చెల్లిస్తాను.

ఆర్థిక మంత్రి గారూ,

ప్రస్తుతం ద్రవ్యోల్బణం చంపేస్తోంది. అంతకుముందు ప్రతి నెలా నా భార్య రమ, పిల్లలను రెండు సినిమాలకు తీసుకువెళ్ళేవాడిని. నా భార్య రమకు సినిమాలంటే ఇష్టం. కానీ ఇప్పుడు ఒక్క సినిమాకి వెళ్ళడం కూడా కుదరడం లేదు. ఏదైనా ఊరి ప్రయాణం, సినిమాలు, బయట భోజనం చేయడం ఇవన్నీ ఇప్పుడు చాలా ఖర్చుతో కూడిన పనులుగా మారిపోయాయి. పన్ను చెల్లింపుదారులైన మా కోసం మీరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? ఆర్థిక మంత్రి గారూ, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.5 లక్షలు కాదా? పన్ను విధించదగిన ఆదాయం ఐదు లక్షల రూపాయలకు మించి ఉంటే, అప్పుడు పన్ను విధిస్తారనే విషయం మీకు తెలిసిందే కదా? పొదుపుపై పన్ను ప్రోత్సాహకం అంటే 80C పరిమితి కూడా సంవత్సరాలుగా పెరగలేదు. ఎన్నో ఏళ్లుగా ఈ పరిమితి 1.5 లక్షలుగానే ఉంది. ఈపీఎఫ్‌, పిల్లల స్కూల్ ఫీజులు, జీతం నుంచి కవర్ అయిన బీమా ప్రీమియంలతో ఇది పూర్తి అయిపోతుంది.

నేను హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొన్నాను. నేను ELSS లో పెట్టుబడి పెడతాను. కానీ నేను పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేనప్పుడు ఇవన్నీ చేసి ఉపయోగం ఏమిటి. వీలైతే, ఈ సంవత్సరం 80C పరిమితిని పెంచండి. మీరు కొత్త పన్ను విధానాన్ని కూడా తీసుకొచ్చారు. అది జనాలకు నచ్చలేదన్నది వేరే విషయం. ఆర్థిక మంత్రి గారూ, మా పొదుపుపై పన్ను మినహాయింపు పొందాలి. ఇది మా కనీస హక్కు. మీ బడ్జెట్ కంపెనీలకు చాలా రాయితీలను ఇస్తుంది. నిజానికి మన దేశంలో కంపెనీలు కట్టే టాక్స్ కంటే.. మా ఆదాయం ద్వారా ఎక్కువ పన్ను చెల్లిస్తున్నాము. ఇది అన్యాయంగా మీకు అనిపించడం లేదా? ఇలా రాస్తూ పోతే.. ఇంకా రాయాల్సింది చాలా ఉంది కానీ లంచ్ టైం అయిపోయింది. మీరు మన దేశానికే ఆర్థిక మంత్రి. నేను కొంచెం రాసినా చాలా వరకూ అర్ధం చేసుకోగలరు. ఆఫీసుకు సెలవు పెట్టి ఈసారి బడ్జెట్ మొత్తం వింటాను. నిర్మలమ్మా.. టాక్స్ కట్టడంలో మేము చూపిస్తున్న చిత్తశుద్దిని గుర్తించి.. నాలాంటి టాక్స్ పేయర్స్ కు ఈ బడ్జెట్ లో మకంచి చేస్తారని ఆశిస్తున్నాను.

మీ

రవీంద్ర

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?